Watch: దూరం నుంచి చూసి విమానం అనుకున్నారు.. తీరా దగ్గరకెళ్లగా..

వాళ్లంతా అమాయక ఆదివాసీలు.. గిరిజన గూడెల్లో జీవనం.. కాఫీ తోటల్లో కూలీలుగాను, జీవనోపాధి కోసం అడవుల్లోకి వెళుతుంటారు. అలా పాడేరు ఏజెన్సీలోకి వెళ్ళిన కొందరి గిరిజనులకు ఊహించని పరిణామం ఎదురైంది. సడెన్‌గా వారి ముందు ఆకాంశంలోంచి ఏదో కిందపడింది. దూరం నుంచి చూసేందుకు అది చిన్నపాటి విమానంలా కనిపిస్తోంది. దీంతో పరిసర ప్రాంతాల్లో ఉన్న గిరిజనులంతా భయంతో పరుగులు తీశారు. కాసేపటికి అక్కడికి చేరుకున్న కొందరు యువకుడు అది విమానం కాదని డ్రోన్ అని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Watch: దూరం నుంచి చూసి విమానం అనుకున్నారు.. తీరా దగ్గరకెళ్లగా..
Medical Drones Paderu

Edited By:

Updated on: Mar 29, 2026 | 12:39 AM

కొండ కోనల్లో నివసించే గిరిజనుల అత్యవసర ఆరోగ్య కష్టాలను తిర్చేందుకు అత్యధిక డ్రోన్లను అందుబాటులో తీసుకొచ్చారు. డ్రోన్లతో మారుమూల ప్రాంతాలకు సైతం ఔషధాలు బ్లడ్ శాంతలను తరలించడంతోపాటు అత్యవసర సమయంలో వైద్యసహకారం అందించేందుకు వీటిని రంగంలోకి దింపారు. ట్రయల్ రన్‌ను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని.. పని కూడా ప్రారంభించాయి. వాహనాలు సిబ్బంది వెళ్లలేని పందులకు అత్యవసర సమయంలో విజయవంతంగా చేరుకునేలా వీటిని వినియోగిస్తున్నారు. రోడ్డు మార్గం ద్వారా గంటన్నర పట్టే సమయాన్ని ఈ డ్రోన్లు కేవలం అరగంటలోనే చేరుకునేలా డిజైన్ చేశారు.

ఇవి100 కిలోమీటర్ల వరకు మూడు కిలోల బరువును మోయడమే కాకుండా.. ల్యాండింగ్ టేక్ ఆఫ్ కూడా ఎక్కువ స్పేస్ అవసరం లేకుండా రూపొందించారు. ఓ సంస్థ ఈ సేవల కోసం ముందుకు రావడంతో అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా అధికారులు కల్పించారు. ఆసుపత్రిలో వద్ద లాంచ్ ప్యాడ్ లను కూడా సిద్ధం చేసారు. చూడ్డానికి చిన్న సైజు విమానంలో కనిపించే ఈ డ్రోన్లు వాటి స్థాయికి తగ్గట్టుగా వాయువేగంతో పనిచేస్తాయి. పాడేరు ఏజెన్సీలో పైలట్ ప్రాజెక్టుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మందుల పంపిణీకి అత్యవసర సేవల కోసం ఈ డ్రోన్‌లను రంగంలోకి దించారు.

పూర్తిగా జిపిఎస్ ఆధారంగా పనిచేసే ఈ మెడికల్ డ్రోన్లు.. ఇటీవలే పని ప్రారంభించాయి. మరికొన్ని రూట్లలో అప్పుడప్పుడు ట్రైల్స్ కూడా జరుగుతున్నాయి. అయితే.. గురువారం సాయంత్రం పాడేరు నుంచి మందులు శాంపిల్స్ తీసుకొని మెడికల్ డ్రోన్ బయలుదేరింది. 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంచంగిపుట్టు పీహెచ్సీకి ఈ డ్రోన్ చేరాల్సి ఉంది. కానీ జి మాడుగుల మండలం మద్దిగరువు- బోయితీలి మధ్య అటవీ ప్రాంతంలోని కొండపైకి రాగానే సాంకేతిక ఇబ్బందులతో జిపిఎస్ సిగ్నల్ ఒక్కసారిగా తెగిపోయింది. దీంతో అక్కడే డ్రోన్ కూలిపోయింది.

అది గమనించిన గిరిజనులు ఆకాశం నుంచి ఏదో పడిందని భయంతో పరుగులు తీశారు. ఆ తర్వాత తేరుకుని భయంతోనే ఆ కొండ వైపు కదలారు.. ఈ లోగా అక్కడ నుంచి బీప్ శబ్దం రావడంతో బాంబు ఏదో ఉండి ఉంటుందని భయపడ్డారు. దూరం నుంచి చూస్తే చిన్నపాటి విమానంగా కనిపించడంతో ఆందోళన మరింత ఎక్కువైంది. కొంతమంది యువకులు ధైర్యం చేసి దగ్గరకు వెళ్లడంతో అసలు విషయం తెలిసింది. అది విమానం మరే ఇతర వస్తువు కాదు ఏజెన్సీ ప్రాంతాల్లో.. మందులను తరలించే మెడికల్ డ్రోన్ గా గుర్తించారు. అది వివరిస్తున్నప్పటికీ చాలామంది గిరిజనులు ఇంకా ఆందోళన తగ్గలేదు.

ఈ లోగా జిపిఎస్ ఆధారంగా డ్రోన్ ఉన్న ప్రాంతానికి మెడికల్ డ్రోన్ పైలెట్‌తో పాటు సిబ్బంది చేరుకున్నారు. మెడికల్ డ్రోన్ తో పాటు మందులను కూడా స్వాధీనం చేసుకున్నారు. మందులకు ఎటువంటి నష్టం వాటిల్ల లేదు. అయితే.. మెడికల్ డ్రోన్ పై అక్కడ ఉన్న వారికి అంత సిబ్బంది అవగాహన కల్పించారు. విషయాన్ని వివరించారు. దీంతో అక్కడ గిరిజనులు అంతా ఊపిరి పిలుచుకున్నారు. కొంతమంది సరదాగా ఫోటోలు తీసుకున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us