కృష్ణాజిల్లా మైలవరంలో అఖండ మూవీ ఆగిపోయింది. అనుమతి లేకుండా బెనిఫిట్ షో వేయడంపై రెవెన్యూ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సినిమా వేసిన.. సంఘమిత్ర ధియేటర్ ను సీజ్ చేశారు అధికారులు. ఈ థియేటర్ లో మ్యాట్నీ షోను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు మైలవరం డిప్యూటీ తాసిల్దార్ శ్రీహరి. ఏపీలో టికెట్ల పెంపకంతో పాటు అదనపు షో వేసుకునేందుకు అనుమతి లేకుండా వైసీపీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రోజుకు కేవలం నాలుగు షోలు మాత్రమే వేయాలని.. అది కూడా సాధారణ టికెట్ రేట్లు మాత్రమే కొనసాగించాలని ఆదేశించింది. వీటికి విరుద్ధంగా వ్యవహరించింది సంఘమిత్ర థియేటర్ యాజమాన్యం షో వేసింది. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఈ రోజు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఎక్కడ చూసిన బాలకృష్ణ అభిమానులతో థియేటర్లు నిండిపోయాయి. సినిమా థియేటర్ల దగ్గర ప్రేక్షకుల కేరింతలు.. అభిమానుల సందడితో ఈ రోజు సందడిగా నెలకొంది.
ఇదిలావుంటే.. అఖండ సినిమాను ప్రదర్శిస్తున్న ఓ థియేటర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. ఈ షాకింగ్ సంఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. అఖండ సినిమాను ప్రదర్శిస్తున్న జెమిని థియేటర్లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. ప్రేక్షకులు సినిమా చూస్తుండగా.. ఒక్కసారిగా థియేటర్లో పొగలు అలుముకోవడంతో భయాందోళనకు గురైన ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు.
వెంటనే అప్రమత్తమైన థియేటర్ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా.. అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సిఉంది. షార్ట్ సర్క్యూట్ తో థియేటర్లు మంటలు చెలరేగినట్లు పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి: Amazing Video: ఇంతకాలం చిరుత వేటాడం మాత్రమే చూశాం.. అక్కడ లెక్క తప్పింది..
Health Tips: డయాబెటీస్ బాధితులు రోజు వీటిని తినడం మరిచిపోవద్దు.. అవేంటో తెలుసా..