మూడేళ్ల చిన్నారిని చిదిమేసిన కామాంధుడు.. సంచలన తీర్పు వెలువరించిన కోర్టు..!

తిరుపతి జిల్లాలో మైనర్ బాలిక అత్యాచారం, హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి సహజ మరణం వరకు జీవితాంతం కఠిన కారాగార శిక్ష విధించింది. మైనర్ బాలిక లైంగిక దాడి కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేశారు. చిన్నారులు, బాలికలు, మహిళలపై నేరాలకు పాల్పడే వారికి ఇలాంటి తీర్పు గట్టి హెచ్చరిక అని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అన్నారు.

మూడేళ్ల చిన్నారిని చిదిమేసిన కామాంధుడు.. సంచలన తీర్పు వెలువరించిన కోర్టు..!
Pocso Case Life Sentence

Edited By:

Updated on: Jul 11, 2026 | 11:33 AM

తిరుపతి జిల్లాలో మైనర్ బాలిక అత్యాచారం, హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి సహజ మరణం వరకు జీవితాంతం కఠిన కారాగార శిక్ష విధించింది. మైనర్ బాలిక లైంగిక దాడి కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేశారు.

వివరాల్లో కెళ్తే 2024 నవంబర్ 1వ తేదీన తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఏఎం పురం గ్రామంలో మూడున్నరేళ్ల బాలిక అదృశ్యమైంది. ఈ మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు పోలీసులు. కేసు దర్యాప్తు లో భాగంగా బాలికకు వరుసకు మామ అయిన పాముల నాగరాజు అలియాస్ సుశాంత్‌ను నిందితుడిగా గుర్తించారు. బిస్కెట్లు కొనిస్తానంటూ ఆశ చూపించి గ్రామం లోని దుకాణానికి తీసుకెళ్లిన నిందితుడు అనంతరం గ్రామ చివరలో కొత్తగా నిర్మించిన సచివాలయ భవనం సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అమానుషంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత గొంతు నులిమి హత్య చేసి చేశాడు.

అత్యంత హీనమైన నేరాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్వయంగా ఘటన జరిగిన ప్రదేశానికి పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి నిందితుడిని అరెస్ట్ చేసి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హోం మంత్రి అనిత హామీ ఇచ్చారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. కేసు దర్యాప్తు అధికారిగా పుత్తూరు డీఎస్పీ రవికుమార్ ను నియమించి దర్యాప్తు జరిపించారు.

శాస్త్రీయ ఆధారాలు, ప్రత్యక్ష సాక్ష్యాలు, వైద్య నివేదికలు, క్లూస్ టీం సేకరించిన సాక్ష్యాలతో దర్యాప్తు కొనసాగించారు. ఘటన జరిగిన మరుసటి రోజే 2024, నవంబర్ 2న నిందితుడు పాముల నాగరాజు అలియాస్ సుశాంత్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు పూర్తి చేసి పోక్సో కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. బెయిల్‌పై నిందితుడు విడుదల కాకుండా పోలీసులు తగు చర్యలు తీసుకున్నారు.

కోర్టులో విచారణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ప్రాసిక్యూషన్ తరపున వి. మోహన్ కుమారి కేసు ను వాదించగా విచారణ పూర్తి అయిన తరువాత చిత్తూరు జిల్లా న్యాయమూర్తి, పోక్సో ప్రత్యేక న్యాయస్థానం ఇంచార్జ్ అరుణ సారిక తీర్పు వెలువరించారు. బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేసిన నిందితుడు పాముల నాగరాజు జీవించి ఉన్నంత వరకు కఠిన కారాగార శిక్ష విధించడంతోపాటు బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇచ్చే విధంగా తీర్పు వెలువరించారు. కేసు దర్యాప్తు బృందాన్ని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

చిన్నారులు, బాలికలు, మహిళలపై నేరాలకు పాల్పడే వారికి ఇలాంటి తీర్పు గట్టి హెచ్చరిక అని ఎస్పీ అన్నారు. ఘటన జరిగిన రోజునే ఈ కేసును అత్యంత ప్రాధాన్యత గా తీసుకుని నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇటువంటి కేసుల్లో వేగవంతమైన దర్యాప్తు, పటిష్టమైన నేర నిరూపణ ద్వారా బాధితులకు న్యాయం చేయడానికి తిరుపతి జిల్లా పోలీసులుగా కట్టుబడి ఉన్నామన్నారు. చట్టానికి అతీతంగా ఎవరూ వ్యవహరించలేరని, మహిళలు, చిన్నారులపై ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఒక వైపు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ, బాలికలపైన నేరాల్లో పాల్గొన్న నిందితులపై పోక్సో షీట్లు ఓపెన్ చేసి వారిపై నిరంతర నిఘా ఉంచామని ఎస్పీ తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రత పట్ల తిరుపతి జిల్లా పోలీసు శాఖ బాధ్యతగా పనిచేస్తుంది అన్నారు ఎస్పీ సుబ్బారాయుడు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us