తనను కాటేసిన కట్ల పాము తలను కొరికేసిన ఘనుడు.. నెక్ట్స్ ఏం చేశాడంటే..?
తనను కాటేసిందని కట్ల పాము తలను కొరికి చంపేశాడు ఓ వ్యక్తి. ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తు్న్న ఈ ఘటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని తొట్టంబేడు మండలం చియ్యవరంలో జరిగింది. చియ్యవరం గ్రామానికి చెందిన వెంకటేష్.. ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో అటుగా వచ్చిన విషపూరిత కట్ల పాము కాటేసింది.
తనను కాటేసిందని కట్ల పాము తలను కొరికి చంపేశాడు ఓ వ్యక్తి. ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తు్న్న ఈ ఘటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని తొట్టంబేడు మండలం చియ్యవరంలో జరిగింది. చియ్యవరం గ్రామానికి చెందిన వెంకటేష్.. ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో అటుగా వచ్చిన విషపూరిత కట్ల పాము కాటేసింది. మద్యం మత్తులో ఉన్న వెంకటేష్.. అదే పామును కసిగా కొరికి చంపేశాడు. ఆ తర్వాత.. దాన్ని పక్కనే పెట్టుకుని రాత్రంతా నిద్రపోయాడు. చచ్చిన పామును పక్కనే పెట్టుకుని నిద్రపోయిన వెంకటేష్‌ను కుటుంబసభ్యులు గమనించారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రుయా ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. అయితే, అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Sep 19, 2025 01:26 PM
Follow Us