Andhra Pradesh: మరిదిపై మనసు పారేసుకుంది.. విషయం అందరికీ తెలిసింది.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Andhra Pradesh: ఆమెకు 35 సంవత్సరాలు, అతడికి 27. ఇద్దరూ సమీప బంధువులు. ఆమెకు అతడు మరిది అవుతాడు. అతనికి ఆమె వదిన అవుతుంది. భర్త ఇద్దరు పిల్లలు ఉన్న ఆమెకు అతడితో

Andhra Pradesh: మరిదిపై మనసు పారేసుకుంది.. విషయం అందరికీ తెలిసింది.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Updated on: Jan 05, 2022 | 3:55 PM

Andhra Pradesh: ఆమెకు 35 సంవత్సరాలు, అతడికి 27. ఇద్దరూ సమీప బంధువులు. ఆమెకు అతడు మరిది అవుతాడు. అతనికి ఆమె వదిన అవుతుంది. భర్త ఇద్దరు పిల్లలు ఉన్న ఆమెకు అతడితో చనువు ఏర్పడింది. నిత్యం అతడితో ఆమె చాటింగ్ చేస్తుండేది. విషయం బయటపడటంతో వదిన మరిది ఇద్దరూ ట్రైన్ కింద పది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాధ ఘటన పశ్చిమగోదావరిజిల్లా ఏలూరులో జరిగింది.

వివరాల్లోకెళితే.. ఏలూరు కొత్తపేటకు చెందిన ఓ వివాహిత, రాజమండ్రికి చెందిన హేమూ ఇద్దరూ వరుసకు వదిన, మరిది అవుతారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య ఫేస్ బుక్ ద్వారా చాటింగ్ జరుగుతోంది. విషయం మహిళ భర్తకు తెలియటంతో ఇంట్లో వివాదం మొదలైంది. ఈ క్రమంలో నిన్న రాత్రి హేము రాజమండ్రి నుంచి ఏలూరు వచ్చాడు. మరోవైపు ఇంట్లో ఒక లెటర్ రాసి బయటకు వెళ్ళిన సదరు మహిళ బుధవారం ఏలూరు పవర్ పేట రైల్వే స్టేషన్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహానికి కూతవేటు దూరంలో హేము మృత దేహం కూడ పడి ఉంది. దీంతో వీరిద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారని ప్రచారం జరుగుతుంది.

ఇదిలాఉంటే.. సదరు మహిళ ఆత్మహత్యకు ముందు సూసైడ్ లెటర్ రాసింది. ఆ లెటర్ లో “నా చావుకి ఎవరు బాధ్యులు కాదు, నా ఈ జీవితం నచ్చక అలా ఉన్నా, చనిపోతున్నా. రాజేష్ నితిన్‌ని బాగా చూసుకో, చదువు ఆపకు. రెండు సంవత్సరాల తరవాత మెరైన్ ఇంజనీర్ చదువుతా అన్నాడు. అవి వాడు లోన్ పెట్టుకొని చదువుకుంటాడు. చూస్తూ ఉండు జాగ్రత్త”. అని రాసింది. అయితే.. మహిళ, హేము వ్యవహారం ఇంట్లో తెలిసిందన్న భయంతోనే వారు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, హేము అత్మహత్యకు ప్రేరేపించడం వల్లే ఇద్దరూ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని మహిళ భర్త రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Perni Nani vs RGV: వర్మ ప్రశ్నలకు పేర్ని నాని కౌంటర్ ఎటాక్.. ఏ చట్టం చెప్పిందంటూ..

Anupama Parameswaran: లవ్ బ్రేకప్ గురించి హీరోయిన్ ఓపెన్ కామెంట్స్.. కానీ.. ప్రేమను గుర్తుచేసుకోనంటూ..

 Bellamkonda Sreenivas : స్పీడ్ పెంచిన బెల్లం కొండ హీరో.. ఛత్రపతి హిందీ రీమేక్ టాకీ పార్ట్ పూర్తి

RGV On AP Govt. సినిమా టికెట్స్ వ్యవహారం.. ఏపీ ప్రభుత్వానికి పది ప్రశ్నలను సంధించిన రామ్ గోపాల్ వర్మ ..