AP Govt Jobs 2022: బీఎస్సీ/ఎమ్మెస్సీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. 2 రోజుల్లో ముగుస్తున్న గడువు!

|

Feb 13, 2022 | 10:41 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాని (AP Govt కి చెందిన కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒప్పంద, ఔట్‌సోర్సింగ్‌ (outsourcing jobs) ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

AP Govt Jobs 2022: బీఎస్సీ/ఎమ్మెస్సీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. 2 రోజుల్లో ముగుస్తున్న గడువు!
Ap Latest Jobs
Follow us on

Kurnool Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాని (AP Govt కి చెందిన కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒప్పంద, ఔట్‌సోర్సింగ్‌ (outsourcing jobs) ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 12

పోస్టుల వివరాలు: ల్యాబ్‌ టెక్నీషియన్‌, స్ట్రెచర్‌ బేరర్‌, ఫార్మసిస్ట్‌, డార్క్‌ రూం అసిస్టెంట్‌, ఆడియోమెట్రీ టెక్నీషియన్‌, స్పీచ్‌ థెరపిస్ట్‌, ఫిజిసిస్ట్‌/న్యూక్లియర్‌ ఫిజిసిస్ట్‌, పర్‌ఫ్యూజనిస్ట్‌, ప్రోస్థటిక్‌ టెక్నీషిషన్‌.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే ఏపీ పారామెడికల్‌ బోర్డులో అభ్యర్ధుల పేరు నమోదై ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: సూపరింటెండెంట్‌ కార్యాలయం, గవర్నమెంట్‌ జనరల్ హాస్పిటల్‌, కర్నూలు, ఏపీ.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 15, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

FTII Recruitment 2022: నెలకు రూ.లక్షకు పైగా జీతంతో టీచర్‌ ఉద్యోగాలు..ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపికలు!