సారో చేతబడి చేశారు.. రాత్రైతే చాలు అలా అయిపోతున్నా.. కలెక్టర్‌కు వింత ఫిర్యాదు

కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి తన హైట్ తగ్గిపోవడానికి చేతబడులే కారణమంటూ జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. 165 సెం.మీ. నుంచి 158 సెం.మీ.కు తగ్గిపోయానని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే చేతబడుల వల్ల మనిషి ఎత్తు తగ్గుతుందనే దానికి శాస్త్రీయ ఆధారాలు లేవు.

సారో చేతబడి చేశారు.. రాత్రైతే చాలు అలా అయిపోతున్నా.. కలెక్టర్‌కు వింత ఫిర్యాదు
Kurnool Man Complains To Collector

Edited By:

Updated on: Sep 25, 2026 | 8:19 AM

చేతబడుల కారణంగా ఎత్తు (హైట్) తగ్గిపోతున్నా.. శరీరంలో విపరీతమైన మార్పులు వస్తున్నాయ్.. పగలు ఒక రకంగా.. రాత్రి మరో రకంగా ఉంటున్నా.. చర్యలు తీసుకోండి అంటూ.. ఒక వ్యక్తి జిల్లా కలెక్టర్‌కు వినూత్న ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. గ్రీవెన్స్ సెల్‌లో ఇలాంటి వింత ఫిర్యాదు అందడం.. అధికారులను విస్మయానికి గురిచేయడంతోపాటు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ విచిత్ర సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. చేతబడుల కారణంగా తాను హైట్ తగ్గుతున్నానని తగ్గానని ఏకంగా ఓ విద్యావంతుడు జిల్లా కలెక్టర్ కి గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఫిర్యాదు చేసిన వ్యక్తి పేరు సుధాకర్.. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పాలకుర్తి గ్రామం. గ్రాడ్యుయేట్ వరకు చదివిన సుధాకర్ సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు. చేతబడుల కారణంగానే తన అన్న మృతి చెందాడని, తనకు కూడా గుర్తు తెలియని వ్యక్తులు చేతబడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ చేతబడుల కారణంగా తన శరీరంలో విపరీతమైన మార్పులు వస్తున్నాయని, తల్లిని కొడుతున్నానని, ఎత్తు తగ్గుతున్నానని పేర్కొన్నాడు.. రాత్రి ఒక విధంగా.. పగలు మరో విధంగా ఉంటున్నానని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా రాత్రి పూట హైట్ తగ్గుతున్నాననంటూ చెప్పుకొచ్చాడు..

చాలా హైట్ ఉన్నా.. తగ్గిపోయా..

165 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న తాను.. 158 కి తగ్గిపోవడానికి చేతబడులే కారణం అని అంటూ ఆవేదన వ్యక్తంచేశాడు.. అందుకే ఈ చేతబడులు చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు సుధాకర్ తెలిపారు. సుధాకర్ వింత ఫిర్యాదుతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

వీడియో చూడండి..

మూఢనమ్మకాలను నమ్మొద్దు..

అయితే.. అవన్నీ మూఢనమ్మకాలు మాత్రమే.. మూఢనమ్మకాలను విశ్వసించడం కారణంగా కొందరు తమకు జరిగే శారీరక, మానసిక మార్పులను చేతబడులతో ముడిపెడుతుంటారు. వాస్తవానికి చేతబడులు, మంత్రాల వల్ల మనుషుల ఎత్తు తగ్గడం అనేది సాధ్యం కాదు. కొన్ని శారీరక రుగ్మతల వల్ల మాత్రమే అలా అనిపిస్తుంది. అయితే.. సుధాకర్ కు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us