AP News: హైవేపై రెడ్ కారు రెక్‌లెస్ డ్రైవింగ్.. పోలీసుల ఎంట్రీతో వెలుగులోకి మైండ్ బ్లాంక్ ట్విస్ట్

| Edited By: Ravi Kiran

Nov 18, 2024 | 8:00 PM

సినీ ఫక్కీలో ఓ వ్యాపారి కిడ్నాప్‌కు గురయ్యాడు. కిడ్నాప్‌కు గురైన గంటల వ్యవధిలోనే పోలీసులు కిడ్నాపర్లను పట్టుకున్నారు. కిడ్నాప్‌కు గురైన వ్యాపారి పిల్లి వెంకట కృష్ణారావు కథ చివరికి సుఖాంతం అయింది.

AP News: హైవేపై రెడ్ కారు రెక్‌లెస్ డ్రైవింగ్.. పోలీసుల ఎంట్రీతో వెలుగులోకి మైండ్ బ్లాంక్ ట్విస్ట్
Ap News
Follow us on

బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం భేతాళవారిపాలెలో సినీ ఫక్కీలో జరిగిన కిడ్నాప్ కలకలం రేపింది. గ్రామానికి చెందిన పిల్లి వెంకట కృష్ణారావు కిడ్నాప్‌కు గురవ్వడంతో బంధువులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులను అలర్ట్‌ చేశారు. అన్ని రహదారుల్లో చెకింగ్‌ చేపట్టారు. చిన్నగంజాం టోల్ ప్లాజా దగ్గర కిడ్నాపర్లను చాకచక్యంగా పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కథ సుఖాంతం అయింది.

ఇది చదవండి: మీరు పుట్టిన తేదీని బట్టి మీ వెనకున్న దేవుడెవరో చెప్పొచ్చు.! ఎలాగో తెల్సా

చీరాల డిఎస్‌పి మహమ్మద్ మొయిన్ వెల్లడించిన వివరాల ప్రకారం. పిల్లి వెంకట కృష్ణారావు హైదరాబాద్‌లోని తన స్నేహితుడు రియాజ్ అకౌంట్‌లో నుంచి కొన్ని డాలర్లను తన అకౌంట్‌లోకి మార్చుకున్నాడు. ఆ తరువాత రియాజ్ డాలర్ల గురించి ఎంత అడిగినా కృష్ణారావు స్పందించలేదు. దీంతో విసుగు చెందిన రియాజ్ తన స్నేహితుడు ఆనంద్‌కు విషయం తెలిపాడు. ఆనంద్ తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ నుంచి రెండు కార్లలో ఆదివారం ఉదయం భేతాళవారిపాలెం గ్రామానికి వచ్చి కృష్ణారావుని కార్లో ఎక్కించుకొని బలవంతంగా ఎత్తుకెళ్ళారు. కృష్ణారావును బలవంతంగా ఎత్తుకెళుతున్నారన్న విషయాన్ని గమనించిన కృష్ణారావు బావమరిది బెజ్జం హరిక్రిష్ణ వెంటనే చిన్నగంజాం పోలీసులకు సమాచారం అందించాడు.

ఇవి కూడా చదవండి

చీరాల డిఎస్‌పి మహమ్మద్ మొయిన్ ఆదేశాలతో హుటాహుటిన రంగంలోకి దిగిన చిన్నగంజాం పోలీసులు అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నగంజాం టోల్ ప్లాజా వైపు వెళుతున్నట్టుగా నిందితుల సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ద్వారా గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యారు. చినగంజాం చెక్‌పోస్ట్‌ దగ్గర కాపుకాసి కారులో కృష్ణారావును బలవంతంగా తీసుకెళుతుండగా అడ్డుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో కిడ్నాప్ కధ గంటల వ్యవధిలోనే సుఖాంతమైంది. కిడ్నాప్‌కు పాల్పడ్డ ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కృష్ణారావును సంరక్షించి బంధువులకు అప్పగించారు. కిడ్నాప్‌కు ఉపయోగించిన రెండుకార్లు, సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు.

ఇది చదవండి: తస్సాదియ్యా.! పే..ద్ద టాస్కే ఇది.. పామును గుర్తిస్తే మీరే తెలివైనవారే

అయితే ఇక్కడే ఒక ట్విస్ట్‌ ఉంది.. కిడ్నాప్‌కు గురైన కృష్ణారావు ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులను నమ్మించి 30 లక్షలు కాజేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ డబ్బులను వసూలు చేసుకునే క్రమంలో మోసపోయిన వ్యక్తులు కృష్ణారావును కిడ్నాప్‌ చేయడంతో కలకలం రేగింది. ఒకవేళ మోసపోతే పోలీసులను ఆశ్రయించాలే కాని, ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే అదే చట్టం చేతిలో చిక్కి కటకటాల వెనక్కి వెళ్ళడం మోసపోయిన వారి వంతైంది.

ఇది చదవండి: బాబోయ్.. అది రోడ్డు కాదు భారీ కొండచిలువ.. పట్టు జారితే పరలోకానికే

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..