దసరా వేళ కనకదుర్గమ్మకు స్వర్ణ కిరీటం సమర్పణ.. విలువ ఎంతంటే…?

దసరా శరన్నవరాత్రుల వేళ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు అపురూప కానుక అందింది. శ్రీకాకుళానికి చెందిన కె. దుర్గా శ్రీనివాస్ రూ.75 లక్షల విలువైన 494 గ్రాముల నవరత్న ఖచిత స్వర్ణ కిరీటాన్ని అమ్మవారికి సమర్పించారు. దాత కుటుంబానికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి, వేదాశీర్వచనం అందించారు.

దసరా వేళ కనకదుర్గమ్మకు స్వర్ణ కిరీటం సమర్పణ.. విలువ ఎంతంటే...?
Gold Crown Donation

Edited By:

Updated on: Oct 15, 2026 | 7:10 PM

దసరా శరన్నవరాత్రుల వేళ ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి అపురూప కానుక అందింది. భక్తితో సమర్పించిన 494 గ్రాముల బంగారు కిరీటం కనకదుర్గమ్మ సన్నిధికి చేరింది. సుమారు రూ.75 లక్షల విలువైన నవరత్న ఖచిత స్వర్ణ కిరీటాన్ని శ్రీకాకుళానికి చెందిన కె. దుర్గా శ్రీనివాస్ గురువారం అమ్మవారికి సమర్పించారు.

దసరా శరన్నవరాత్రుల వేళ ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి అపురూప కానుక అందింది. భక్తితో సమర్పించిన బంగారు కిరీటం కనకదుర్గమ్మ సన్నిధికి చేరింది. శ్రీకాకుళానికి చెందిన కె. దుర్గా శ్రీనివాస్ సుమారు రూ.75 లక్షల విలువైన 494 గ్రాముల స్వర్ణ కిరీటాన్ని గురువారం అమ్మవారికి సమర్పించారు. ఎరుపు, నీలం, తెలుపు, పచ్చ రంగుల రాళ్లతో అందంగా తీర్చిదిద్దిన ఈ నవరత్న ఖచిత కిరీటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దసరా ఉత్సవాలతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతున్న వేళ ఈ స్వర్ణ కానుకను ఆలయ అధికారులకు అందజేశారు.

భక్తితో అమ్మవారికి స్వర్ణ కిరీటం

శ్రీకాకుళం పట్టణానికి చెందిన కూర్మినాయుడు, పద్మావతమ్మ దంపతుల కుమారుడు కె. దుర్గా శ్రీనివాస్ ఈ కిరీటాన్ని అమ్మవారికి కానుకగా సమర్పించారు. సుమారు రూ.75 లక్షల విలువైన ఈ కిరీటాన్ని భక్తిశ్రద్ధలతో ఆలయానికి తీసుకొచ్చి అధికారులకు అందజేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్, దసరా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ వి. త్రినాథరావు సంయుక్తంగా స్వర్ణ కిరీటాన్ని స్వీకరించారు.

దాత కుటుంబానికి ప్రత్యేక దర్శనం

స్వర్ణ కిరీటాన్ని సమర్పించిన అనంతరం దాత కుటుంబ సభ్యులకు అంతరాలయంలో శ్రీ కనకదుర్గమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేసి సత్కరించారు.

అమ్మవారి దయతోనే ఈ కానుక సమర్పించా..

ఈ సందర్భంగా దాత కె. దుర్గా శ్రీనివాస్ మాట్లాడుతూ, లోకపావని అయిన శ్రీ కనకదుర్గమ్మవారి దయతోనే ఈ స్వర్ణ కిరీటాన్ని సమర్పించుకునే భాగ్యం కలిగిందని తెలిపారు. పవిత్రమైన దసరా శరన్నవరాత్రుల సమయంలో అమ్మవారికి స్వర్ణ కిరీటాన్ని బహూకరించే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవకాశం కల్పించిన ఆలయ ఈవోకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us