ఏపీలో కీలక పరిణామం.. మైదుకూరు మున్సిపల్ ఎన్నిక నిలిపివేత..!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా నిలిపివేసింది. కడప జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ సమర్పించిన నివేదికను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది..

ఏపీలో కీలక పరిణామం.. మైదుకూరు మున్సిపల్ ఎన్నిక నిలిపివేత..!
State Election Commissioner Anil Chandra Puneta

Updated on: Oct 19, 2026 | 1:55 PM

కడప: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా నిలిపివేసింది. నామినేషన్ కేంద్రంలో పత్రాల ధ్వంసం ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

19 నామినేషన్ పత్రాలు ధ్వంసం

ఎస్ఈసీ ఉత్తర్వుల ప్రకారం.. అక్టోబర్ 17న మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు మైదుకూరు మున్సిపల్ నామినేషన్ కేంద్రంలోకి చొరబడి 19 నామినేషన్ పత్రాలను చించివేశారు. ఈ ఘటనలో 18 మంది అభ్యర్థులు ప్రభావితమయ్యారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు అదే రోజు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఒక్కరే తిరిగి నామినేషన్ దాఖలు

ప్రభావిత అభ్యర్థులు తిరిగి నామినేషన్లు సమర్పించేందుకు అధికారులు అవకాశం కల్పించారు. అక్టోబర్ 18న మధ్యాహ్నం 3 గంటల్లోపు కొత్త పత్రాలు సమర్పించాలని సూచించారు. అవసరమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. అయితే, 18 మంది అభ్యర్థుల్లో బీజేపీకి చెందిన 21వ వార్డు అభ్యర్థి మచునూరి శ్రీదేవి మాత్రమే తిరిగి నామినేషన్ దాఖలు చేశారు. మిగిలిన 17 మంది స్పందించలేదు.

తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు బ్రేక్!

జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ నివేదికలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల సంఘం మైదుకూరు మున్సిపాలిటీ చైర్‌పర్సన్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించిన తదుపరి ప్రక్రియను నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ నిలుపుదల కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీంతో మైదుకూరు మున్సిపల్ ఎన్నికల భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us