
రోజుకో వీడియో, పూటకో ట్విస్ట్ అన్నట్టుగా కంటిన్యూగా హెడ్‌లైన్స్‌లోకి వస్తోంది జనసేన ఎమ్మెల్యే అరవశ్రీధర్ వివాదం. ఇవాళ కూడా బాధితురాలు వీణ మరో రెండు బాంబులు పేల్చింది. అరవ శ్రీధర్‌కు తనతోనే కాదు, మరో ఆరుగురు అమ్మాయిలతో సంబంధం ఉందని ఆరోపించింది. అంతేకాదు 5 అబార్షన్లపై వస్తున్న విమర్శలపైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది బాధితురాలు.. 18నెలల్లో 5అబార్షన్లు. అసలిది సాధ్యమేనా అంటూ బాధితురాలు వీణపై విమర్శల వాన కురిసింది. అయితే తనకు జరిగింది అబార్షన్ కాదని, అబార్టెడ్ అంటున్నారు వీణ. అంటే గర్బం వచ్చిందని తెలియగానే టాబ్లెట్స్ తీసుకుని గర్భం రాకుండా చేసుకున్నానన్నది బాధితురాలి వెర్షన్. అంతేకాదు అసలు 25కోట్లు తాను అడగలేదని, అసలా వాయిస్సే తనది కాదంటూ వీణ పేర్కొన్నారు.
అరవ శ్రీధర్‌కు ఆరుగురు అమ్మాయిలతో సంబంధం ఉందంటున్నారు వీణ. ఆ విషయం తెలిసినప్పటి నుంచే తాను వీడియోలను రికార్డ్ చేయడం స్టార్ట్ చేశానంటూ వీణ పేర్కొన్నారు. అలాగే దీన్ని ఒక మహిళ, పురుషుడికి సంబంధించిన అంశంగానే చూడాలని, రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదంటున్నారు వీణ. NHRCఆదేశాలతో అరవశ్రీధర్‌పై కేసు నమోదైందని, ఏపీ వ్యక్తులతో సంబంధంలేకుండా, నేషనల్ వుమెన్ కమిషన్ ఆధ్వర్యంలో కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నట్లు వీణ తెలిపారు.
ఇప్పటికే MLA అరవ శ్రీధర్‌పై మరో వీడియో వదిలింది బాధితురాలు హర్షవీణ.. తాతంశెట్టి నాగేంద్రకు సంబంధించిన చాటింగ్‌ను బయటపెట్టిందామె. తాతంశెట్టి నాగేంద్రను అరవ శ్రీధర్ తిట్టినట్టుగా చాటింగ్‌లో కామెంట్స్ ఉన్నాయి. తాతంశెట్టి నాగేంద్రకు కొవ్వు ఉందని.. అందుకే, దేవుడు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడని శ్రీధర్ అన్నట్టుగా ఆ చాటింగ్‌లో వ్యాఖ్యలు ఉన్నాయి . ఇలా రోజుకో ట్విస్ట్‌తో అరవశ్రీధర్ వివాదం పరుగులు పెడుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..