
16 మంది ఇటలీ దేశస్తులు.. వారంతా ఇటలీ నుంచి ఇండియాకు టూర్ వచ్చారు.. దీనిలో భాగంగా అన్నీ పర్యాట ప్రదేశాలను చుట్టేస్తూ.. వైజాగ్‌లో దిగారు.. ఈ క్రమంలోనే.. యూరాడ బీచ్‌కు సరదాగా వెళ్లారు. ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొట్టారు.. ఈ క్రమంలోనే.. నీటిలో దిగి సరదాగా ఆడుకుంటూ కనిపించారు.. అయితే.. వాళ్ల తీరు చూసి.. లోతు ఎక్కువగా ఉంది.. సముద్రంతో చెలగాటం వద్దు.. అలలను నమ్మొద్దు.. ముంచేస్తాయ్.. అంటూ మెరైన్ సిబ్బంది, జీవీఎంసీ లైఫ్ గాడ్స్ హెచ్చరించారు.. అయినా వారు వినలేదు.. సముద్రంలో స్విమ్మింగ్ చేస్తూ లోతులోకి వెళ్లారు.. ఇంకేముంది.. అలలు చుట్టుముట్టి ఓ ప్రాణాన్ని బలిగొన్నాయి.. మరికొందరు నీటిలో కొట్టుకుపోతుంటే.. చూసి.. మెరైన్ సిబ్బంది, జీవీఎంసీ లైఫ్ గాడ్స్ అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడికి చేరుకుని పలువురిని కాపాడారు.. ఈ ఘటనలో ఒకరు చనిపోవడంతో.. ఇటలీకి చెందిన మరో 15 మంది కన్నీరుమున్నీరుగా విలపించారు.
వివరాల ప్రకారం.. ఇటలీకి చెందిన 16 మంది విదేశీయులు విశాఖలోని యారాడ బీచ్ కు వచ్చారు.. ఈ క్రమంలో స్నానం చేస్తుండగా వారిలో ఒకరు మృతి చెందారు. ఆ ప్రదేశంలో లోతు ఎక్కువగా ఉందని, ఈతకు దిగొద్దంటూ మెరైన్ పోలీసులు, జీవీఎంసీ లైఫ్ గార్డులు అంతకుముందే హెచ్చరించారు.. అయినా.. వారు పట్టించుకోకుండా సముద్రంలోకి వెళ్లారు. ఇద్దరు ఇటాలియన్లు అలల ఉధృతికి కొట్టుకుపోయారు.. వెంటనే అలర్టయిన పోర్టు మెరైన్ పోలీసులు, జీవీఎంసీ లైఫ్ గార్డులు మునిగిపోతున్న వారిని ఒడ్డుకు తీసుకొచ్చారు. వారిలో ఒకరు తీవ్ర అస్వస్థతకు గురికాగా.. సీపీఆర్ చేశారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించి.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. న్యూ పోర్ట్ పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..