Andhra Pradesh: ఏం కాదులే అని ముందుకు వెళ్లాడు.. అందరి ప్రాణాలను రిస్క్‌లో పెట్టాడు.. అదృష్టం బాగుండి బయటపడ్డారు..

|

Aug 15, 2021 | 5:31 AM

Andhra Pradesh: విశాఖ ఏజెన్సీలో తృటిలో ఘోరప్రమాదం తప్పింది. ముంచంగిపుట్టులో ప్రయాణికులతో వెళ్తున్న జీపు.. నీటి ప్రవాహంలో చిక్కుకుంది.

Andhra Pradesh: ఏం కాదులే అని ముందుకు వెళ్లాడు.. అందరి ప్రాణాలను రిస్క్‌లో పెట్టాడు.. అదృష్టం బాగుండి బయటపడ్డారు..
Jeep
Follow us on

Andhra Pradesh: విశాఖ ఏజెన్సీలో తృటిలో ఘోరప్రమాదం తప్పింది. ముంచంగిపుట్టులో ప్రయాణికులతో వెళ్తున్న జీపు.. నీటి ప్రవాహంలో చిక్కుకుంది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు.. వెంటనే అప్రమత్తమై కిందకు దిగిపోయారు. అందరూ క్షేమంగా ఒడ్డుకు చేరి ప్రాణాలు దక్కించుకున్నారు. అయితే, నీటి ప్రవాహం మరీ ప్రమాదకరంగా లేకపోవడ, అదే సమయంలో ఇసుక ట్రాక్టర్ రావడంతో.. ఆ ట్రాక్టర్ సాయంతో నీటిలోకి ఒరిగిన జీపును బయటకు లాగారు. జీపును బయటకు తీసుకువచ్చేందుకు స్థానికులు, ట్రాక్టర్ డ్రైవర్ చాలా కష్టపడాల్సి వచ్చింది.

ఇదిలాఉండే.. ఒడిశా, ఏవోబీలో వరుసగా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదలు పొటెత్తడంతో.. జోలాపుట్ డ్యామ్‌లోకి నీరు భారీగా చేరుతోంది. మరోవైపు.. విశాఖలోని మత్స్యగెడ్డలో నీటి ప్రవాహం పెరుగుతోంది. వాస్తవానికి సాధారణ సమయాల్లో ఆ ప్రాంతంలో నీటి ప్రవాహం అంతగా ఉండదు. దాంతో అటువైపు నుంచే ఏపీ, ఒడిశా రాష్ట్రాల మధ్య వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. అయితే, తాజాగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. నీటి ప్రవాహాన్ని అంచనా వేయలేకపోయిన జీపు డ్రైవర్.. ప్రయాణికులను ఎక్కించుకుని అలాగే రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. అయితే, మధ్యలోకి వెళ్లగానే.. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఆ జీపు ముందుకు కదలలేకపోయింది. వరద ప్రవాహానికి జీపు పక్కకు జరిగి ఓవైపు ఒరిగిపోయింది. మొత్తానికి స్థానికులు, ట్రాక్టర్ సాయంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడగా.. జీపు సైతం బయటకు వచ్చింది.

Also read:

YS Viveka Murder Case: ‘‘పెద్దలతో పెట్టుకునే శక్తి లేదు.. నాకు ప్రాణ హానీ ఉంది’’: మణికంఠ రెడ్డి

Earthquake in Haiti: హైతీలో భారీ భూకంపం.. 29 మందికి పైగా మృతి.. శిథిలాల్లో చిక్కుకున్న వందలాదిమంది..

IND vs ENG 2nd Test Day 3: లార్డ్స్ టెస్ట్‌లో ఇంగ్లండ్ ఆలౌట్.. తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులు..