గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ మేజర్ కాల్వకు గండి.. 100 ఎకరాల వరిపంట మునక

రైతులు ఆరుగాలం కష్టపడి పండించి వరిపంట నీటమునిగింది.  గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం అనుపాలెం వద్ద ఉన్న బెల్లంకొండ మేజర్ కాల్వకు గండిపడింది.

గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ మేజర్ కాల్వకు గండి.. 100 ఎకరాల వరిపంట మునక
Follow us

|

Updated on: Nov 15, 2020 | 2:24 PM

రైతులు ఆరుగాలం కష్టపడి పండించి వరిపంట నీటమునిగింది.  గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం అనుపాలెం వద్ద ఉన్న బెల్లంకొండ మేజర్ కాల్వకు గండిపడింది. దీంతో అంచులవారిపాలెంకు చెందిన సుమారు 100 ఎకరాల వరి పంట నీట మునిగింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ పంట మునిగిందని బాధిత రైతులు ఆరోపించారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పండించిన పంట నోటి వరకు వచ్చి చేజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీటలు పడిన కాల్వకు మరమ్మతులు చేయాల్సిందిగా తాము ఎన్నిసార్లు అధికారులు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి పెట్టాలని.. తమకు నష్టపరిహారం చెల్లించాలని అన్నదాతలు కోరుతున్నారు. అప్రమత్తమైన అధికారులు గండి పూడ్చేందుకు చర్యలు ప్రారంభించారు.

దీనిపై ఎన్​ఎస్పీ ఏఈ భాస్కర్ బాబు స్పందించారు. కాల్వకు గురించి గతంలోనే ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామని చెప్పారు. అయితే మరమ్మత్తులకు అనుమతులు వచ్చే లోపలే అకస్మాత్తుగా గండి పడిందని వివరించారు. కాల్వకు చెందిన స్థలంలో కొందరు రైతులు అక్రమంగా పంటలు వేశారని ఆయన ఆరోపించారు. పంట నష్టాన్ని అంచనా వేసి అధికారులు నివేదిక పంపుతామని చెప్పారు.

Also Raed :

కొమురంభీం జిల్లాలో కానిస్టేబుల్ మిస్సింగ్, భార్య ఫిర్యాదు, ఇక్కడే అసలు ట్విస్ట్ !

‘కారు మాదే, యాక్సిడెంట్ చేసింది నా కుమారుడు కాదు’ : సైబర్‌ టవర్స్‌ వద్ద ప్రమాదంపై ఎమ్మెల్యే కాటసాని వివరణ

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొని చిక్కుల్లో పడింది…చివరకు పోలీసులో కొత్త ఫోన్ కొనిచ్చారు..ఆసక్తికర కథనం

Latest Articles
గోధుమ చపాతీతో జీర్ణ సమస్యలా? చిరుధాన్యాలతో బలే రుచిగా రోటీలు..
గోధుమ చపాతీతో జీర్ణ సమస్యలా? చిరుధాన్యాలతో బలే రుచిగా రోటీలు..
వచ్చే 4 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు..
వచ్చే 4 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు..
రూ. 27 వేల ఫోన్‌ రూ. 19వేలకే.. వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్
రూ. 27 వేల ఫోన్‌ రూ. 19వేలకే.. వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్
రూ. 9 వేలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌.. వివో నుంచి కొత్త ఫోన్
రూ. 9 వేలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌.. వివో నుంచి కొత్త ఫోన్
కాషాయం ఎక్కువైంది.. టీమిండియా ప్రపంచకప్ జెర్సీపై ఫ్యాన్స్ ఫైర్
కాషాయం ఎక్కువైంది.. టీమిండియా ప్రపంచకప్ జెర్సీపై ఫ్యాన్స్ ఫైర్
వేసవిలో ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే పండ్లు
వేసవిలో ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే పండ్లు
చెడు కొలెస్ట్రాల్‌ను తరిమికొట్టాలా? ప్రతిరోజూ ఉదయం ఈ ఆకును నమలండి
చెడు కొలెస్ట్రాల్‌ను తరిమికొట్టాలా? ప్రతిరోజూ ఉదయం ఈ ఆకును నమలండి
కొత్తిమీర గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగితే..
కొత్తిమీర గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగితే..
వేగం తగ్గింది సినిమాల్లో.. తనలో కాదు.! ట్రేండింగ్ స్టైల్ తో పూజా
వేగం తగ్గింది సినిమాల్లో.. తనలో కాదు.! ట్రేండింగ్ స్టైల్ తో పూజా
వయ్యారి సొగసరి.. అంజలి అందాలకు ఫిదా అవుతున్న యూత్. ఫోటోస్..
వయ్యారి సొగసరి.. అంజలి అందాలకు ఫిదా అవుతున్న యూత్. ఫోటోస్..