సెకండ్ హ్యాండ్ ఫోన్ కొని చిక్కుల్లో పడింది…చివరకు పోలీసులో కొత్త ఫోన్ కొనిచ్చారు..ఆసక్తికర కథనం

ప్రజంట్ కరోనా ప్రభావంతో విద్యా సంస్థలు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కుమారుడి చదువుల కోసం స్థోమత లేక సెకండ్ హ్యాండ్ ఫోన్ కొన్న ఓ మహిళ చిక్కుల్లో పడింది.

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొని చిక్కుల్లో పడింది...చివరకు పోలీసులో కొత్త ఫోన్ కొనిచ్చారు..ఆసక్తికర కథనం
Follow us

|

Updated on: Nov 15, 2020 | 1:11 PM

ప్రజంట్ కరోనా ప్రభావంతో విద్యా సంస్థలు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కుమారుడి చదువుల కోసం స్థోమత లేక సెకండ్ హ్యాండ్ ఫోన్ కొన్న ఓ మహిళ చిక్కుల్లో పడింది. అది తస్కరించిన ఫోన్‌ అవ్వటం చేత ఓ రోజంతా పోలీస్‌ స్టేషన్‌లో ఉండాల్సి వచ్చింది. చివరకు పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడటంతో ఊపిరి పీల్చుకుంది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై, బోరివ్లీకి చెందిన స్వాతి సుభాష్‌ సావ్రే తన కుమారుడి ఆన్‌లైన్‌ చదువుల కోసం కొద్దిరోజుల క్రితం 6 వేల రూపాయలు పెట్టి సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్‌ కొన్నది. దాని రిపేర్ల కోసం మరో రూ. 1,500 ఖర్చు చేసింది. అనంతరం అందులో సిమ్‌ కార్డు వేసి వినియోగించడం ప్రారంభించారు. అయితే ఆ తర్వాతి రోజు స్వాతి ఇంటి వద్దకు వచ్చిన పోలీసులు.. అది దొంగిలించిన ఫోన్‌ అని చెప్పి, ఆమెను రైల్వే పీఎస్‌కు తీసుకెళ్లారు.

ఓ రోజు మొత్తం విచారించి దొంగతనంతో ఆమెకు ఎటువంటి సంబంధం లేదని నిర్దారించారు. అయితే స్వాతి ఆ ఫోన్‌ను కొనడానికి దాదాపు మూడు నెలల పాటు ఎంతో కష్టపడింది. రూపాయి..రూపాయి కూడబెట్టి మరీ కొడుక్కి ఫోన్ కొనిచ్చింది.ఇప్పుడు ఫోన్ లేకపోతే కుమారుడి చదువు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.  స్వాతి పనిచేస్తున్న ఇంటి ఓనర్‌తో తన గోడును వెళ్లబోసుకుందామె. ఆ యజమాని ఈ విషయాన్ని ముంబై పోలీసులకు ట్వీట్‌ చేశాడు. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. అనంతరం కుమారుడి చదువు కోసం ఆమెకు సెల్‌ ఫోన్‌ను బహుమతిగా ఇచ్చి మంచి మనసు చాటుకున్నారు.

Also Read :

బాలయ్య సినిమాలో రాజశేఖర్​..కానీ కండీషన్స్ అప్లై..ఏ పాత్ర వేస్తున్నారంటే ?

వెంకన్న సన్నిధిలో శాస్త్రోక్తంగా దీపావళి వేడుకలు, శ్రీవారికి హుండీ ఆదాయం ఎంత వచ్చిందంటే ?

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..