AP Rains: ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో అతి భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇది

|

Oct 15, 2024 | 3:25 PM

నైరుతి రుతుపవనాలు ఈరోజు, 15 అక్టోబర్ 2024న దేశం మొత్తం నుండి ఉపసంహరించుకున్నాయి. అదే సమయంలో, ఆగ్నేయ ద్వీపకల్ప భారతదేశంలో ఈరోజు, అక్టోబర్ 15న ఈశాన్య రుతుపవనాల వర్షపాతం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

AP Rains: ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో అతి భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇది
Ap News
Follow us on

నైరుతి రుతుపవనాలు ఈరోజు, 15 అక్టోబర్ 2024న దేశం మొత్తం నుండి ఉపసంహరించుకున్నాయి. అదే సమయంలో, ఆగ్నేయ ద్వీపకల్ప భారతదేశంలో ఈరోజు, అక్టోబర్ 15న ఈశాన్య రుతుపవనాల వర్షపాతం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. నిన్నటి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో బాగా గుర్తించబడిన అల్పపీడనం ఈ రోజు 15 అక్టోబర్ 2024 , ఉదయం 8.30 గంటలకు అదే ప్రాంతంలో కొనసాగుతున్నది. ఇది రాగల 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి వాయుగుండముగా నైరుతి బంగాళాఖాతములో బలపడే అవకాశం ఉంది. ఈ వాయుగుండం తదుపరి 24 గంటల్లో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో సగటు సముద్ర మట్టమునకు 5.8 కి.మీ ఎత్తు వరకు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి దిశగా వంగి ఉంటుంది.

ఇది చదవండి: హిట్‌మ్యాన్ వారసుడొచ్చాడన్నారు.. కట్ చేస్తే.. 3 డకౌట్‌లతో టీమిండియాకు ఎగనామం పెట్టాడు.. ఎవరంటే?

————————–
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-

———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
———————————-

ఈరోజు, రేపు:-

ఇవి కూడా చదవండి

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 35 -45 కిలోమీటర్లు గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగముతో వీస్తాయి.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-
——————————

ఈరోజు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
ఈదురు గాలులు గంటకు 35 -45 కిలోమీటర్లు గరిష్టముగా 55 కిలోమీటర్ల వేగముతో వీస్తాయి.

రేపు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కిలోమీటర్లు గరిష్టముగా 60 కిలోమీటర్ల వేగముతో వీస్తాయి.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది.

ఇది చదవండి: ఈ అమ్మకూచి ఎవరో గుర్తుపట్టారా.? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గోడకు కొట్టిన బంతిలా..

రాయలసీమ:-
———–

ఈరోజు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
ఈదురు గాలులు గంటకు 35 -45 కిలోమీటర్లు గరిష్టముగా 55 కిలోమీటర్ల వేగముతో వీస్తాయి.

రేపు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కిలోమీటర్లు గరిష్టముగా 60 కిలోమీటర్ల వేగముతో వీస్తాయి.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది.

ఇది చదవండి: సముద్రపుటొడ్డున వింత ఆకారం.. ద్రవంలా ఉందని పట్టుకుంటే గుండె గుభేల్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..