Rain Alert: మండే ఎండల్లో కూల్ న్యూస్.. మూడు రోజులు వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

రాబోయే మూడు రోజులు ఏపీతోపాటు.. తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.. రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఏంటో తెలుసుకోండి..

Rain Alert: మండే ఎండల్లో కూల్ న్యూస్.. మూడు రోజులు వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Rain Alert

Updated on: Jun 19, 2024 | 4:30 PM

రుతుపవనాల ఉత్తర పరిమితి పయనం 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, నవసారి, జలగావ్, అమరావతి, చంద్రాపూర్, బీజాపూర్, సుక్మా, మల్కన్‌గిరి, విజయనగరం, 19.5 °N/88°E,21.5°N/89.5°E, 23°N/89.5°E, ఇస్లాంపూర్ గుండా కొనసాగుతుంది. తదుపరి 2-3 రోజులలో నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & వాయువ్య బంగాళాఖాతం, గంగా పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్‌లోని మిగిలిన భాగాలు, బీహార్, జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాలలో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.

దీంతోపాటు ఉపరితల ఆవర్తనం కోస్తా ఆంధ్ర ప్రదేశ్.. దానికి ఆనుకుని ఉన్న తెలంగాణ ప్రాంతముపై సముద్ర మట్టానికి సగటున 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్నది . కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌కు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి సగటున 3.1 కి.మీ ఎత్తులో నున్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు తక్కువగా గుర్తించబడింది. రాయలసీమ & పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 4.5 కి.మీ ఎత్తులో ఎత్తులో నున్న ఉపరితల ఆవర్తనం ఈరోజు తక్కువగా గుర్తించబడినట్లు వాతావరణశాఖ తెలిపింది.

ఈ నేపథ్యంలో రాబోయే మూడు రోజులు ఏపీతోపాటు.. తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది..

రాబోవు మూడు రోజులకు ఏపీలో వాతావరణ సూచనలు :-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

బుధవారం: తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీవర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.

గురువారం, శుక్రవారం: తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :

బుధవారం: తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీవర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.

గురువారం, శుక్రవారం: తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

రాయలసీమ:

బుధవారం, గురువారం, శుక్రవారం: తేలికపాటినుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.

ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us