
ఏపీలోని మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అందించింది. కొత్త సైజుల్లో మద్యం బాటిళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం 90,180,375,750,1000 ఎంఎల్ పరిమాణాల్లో లిక్కర్ బాటిళ్లు సరఫరా చేస్తున్నారు. కానీ త్వరలో 150, 200 ఎంఎల్ సైజుల్లో కూడా బాటిల్స్ రానున్నాయి. దీంతో మందుబాబులకు మరిన్ని సైజుల్లో మద్యం బాటిళ్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా 150, 200 ఎంఎల్ సైజుల్లో కూడా లిక్కర్ బాటిళ్లను తీసుకొస్తామని మద్యం తయారీదారులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ప్రభుత్వం కూడా అందుకు అంగీకరించింది.
ఏపీ ఎక్సై్జ్ శాఖ మద్యం తయారీ కంపెనీలకు అనుమతి మంజూరు చేసింది. దీంతో త్వరలో ఏపీలో 150 ఎంఎల్, 200 ఎంఎల్ మద్యం బాటిళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న సైజుల్లోనే కాకుండా అదనంగా మరిరొన్ని పరిమాణాల్లో ఉన్న వాటిని కూడా మందుబాబులు కొనుగోలు చేయవచ్చు. ఇందుకు సంబంధించి గతంలో ఉన్న నిబంధనల్లో ఎక్సైజ్ శాఖ మార్పులు చేసింది. ఈ మేరకు మద్యం కేసుల్లో ఏ సైజు కలిగిన సీసాలు ఎన్ని ఉండాలనే నిబంధనలను కూడా రూపొందించింది. ఒక కేసులో 200 ఎంఎల్ సైజు బాటిళ్లు 45 ఉండగా.. 150 ఎంఎల్ బాటిళ్లు 60 ఉండాలని ఎక్సైజ్ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం ఒక కేసులో 180 ఎంఎల్ బాటిళ్లు 48 ఉంటుండగా.. 375 ఎంఎల్ సీసాలు 602 ఉంటున్నాయి. ఇక 180 ఎంఎల్ బాటిళ్లు 48 ఉండగా.. ఇక 375 ఎంఎల్ హాఫ్ బాటిళ్లు 24 ఉంటున్నాయి. ఇక 750 ఎంఎల్ ఫుల్ బాటిళ్లు ఒక కేసులో 12 ఉంటున్నాయి. అయితే కొత్తగా వచ్చే 150 ఎంఎల్, 200 ఎంఎల్ బాటిళ్ల ధరలు ప్రస్తుతం ఉన్న ధరల ప్రతిపాదికన ఉంటాయని ఎక్సై్జ్ శాఖ స్పష్టం చేసింది. ఆయా బ్రాండ్‌లకు ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారమే ఉంటాయి. అయితే మద్యం ధరలు మాత్రం ఎప్పటిలాగే కొనసాగుతాయి. వాటిల్లో ఎలాంటి మార్పులు లేవని ఎక్సై్జ్ శాఖ స్పష్టం చేసింది.
అటు ఏపీలో మద్యం సరఫరాలో ఈ మార్పులు చోటుచేసుకోగా.. తెలంగాణలో మాత్రం మందుబాబులకు త్వరలో షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మద్యం ధరలను త్వరలో పెంచేందుకు రేవంత్ సర్కార్ సిద్దమవుతోంది. మద్యం తయారీ కంపెనీలు ధరలను పెంచాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఇటీవల త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ కూడా ధరలను పెంచాలని సూచించింది. లిక్కర్ తయారీదారులు 10 శాతం వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం అంత మొత్తంలో పెంచేందుకు సిద్దంగా లేదని తెలుస్తోంది.