Andhra Pradesh: హాల్ టిక్కెట్ చూపిస్తే “ఫ్రీ”గా ప్రయాణం.. విద్యార్థుల కోసం ఆర్టీసీ కీలక నిర్ణయం

|

Apr 27, 2022 | 8:23 AM

ఏపీలో నేటి నుంచి జరిగే పదో తరగతి పరీక్షలు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టిక్కెట్ చూపిస్తే.. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం విద్యాశాఖ ప్రతి జిల్లాకు ఒక అబ్జర్వర్ ను...

Andhra Pradesh: హాల్ టిక్కెట్ చూపిస్తే ఫ్రీగా ప్రయాణం.. విద్యార్థుల కోసం ఆర్టీసీ కీలక నిర్ణయం
Rtc Tenth
Follow us on

ఏపీలో నేటి నుంచి జరిగే పదో తరగతి పరీక్షలు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టిక్కెట్ చూపిస్తే.. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం విద్యాశాఖ ప్రతి జిల్లాకు ఒక అబ్జర్వర్ ను నియమించింది. 162 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, టెంట్లు, వైద్య సౌకర్యాలు కల్పించారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. కొవిడ్ కారణంగా రెండేళ్లుగా పదో తరగతి పరీక్షలు జరగలేదు. కరోనాకు ముందు రెండు వేల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పుడు 3,800 కి పెంచారు. పరీక్ష సమయానికి గంట ముందుగానే విద్యార్థులను లోపలికి అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు.

ఫీజలు చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తామని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నారన్న ఫిర్యాదులతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నేరుగా వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు(Hall Tickets) డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానందరెడ్డి తెలిపారు. హాల్‌ టికెట్లపై ప్రధానోపాధ్యాయుడి సంతకం లేకపోయినా అనుమతించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సరైన కారణాలతో అరగంట ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి వచ్చినా అనుమతిస్తామన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Also Read

Cashew Benefits: జీడిపప్పు అందుకే తినాలంటారు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

Acharya First Review: ఆచార్య ఫస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందో చెప్పేసిన ఉమైర్ సంధు..