Train Accident: ఏపీలో రైలు ఢీకొని నలుగురు మృతి

AP Train Accident: యువకులు నడుచుకుంటూ వెళ్తుండగా, వేగంగా వస్తున్న రాజారాణి ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే యువకులు బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో పట్టాలపైకి వచ్చిన ఎక్స్‌ప్రెస్‌ రైలు వారిని ఢీకొట్టింది.

Train Accident: ఏపీలో రైలు ఢీకొని నలుగురు మృతి
Train Accident

Updated on: Sep 23, 2026 | 2:46 PM

ఏపీలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కిలి వద్ద రైలు ఢీకొని నలుగురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ట్రాప్‌పై ఐదుగురు యువకులు నడుచుకుంటూ వెళ్తుండగా, వేగంగా వస్తున్న రాజారాణి ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే యువకులు బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో పట్టాలపైకి వచ్చిన ఎక్స్‌ప్రెస్‌ రైలు వారిని ఢీకొట్టింది.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us