కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు(lightning strike) నలుగురు మృతి చెందారు. ఆదోని నియోజకవర్గం లోని కుప్పగల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పొలాలలో పని చేస్తుండగా పిడుగు పడి ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. అదేవిధంగా ఆలూరు నియోజకవర్గం లోని హోలగొంద మండలం వందవగిలి గ్రామంలో పొలాలలో పిడుగు పడటంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. తాయన్న సిద్ధప్ప అనే యువకులు ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కర్నూలు జిల్లాలోనే ఒకేసారి పిడుగు పడి నలుగురు మృతి చెందడం పట్ల విషాదం నెలకొంది.
పిడుగులు దడ పుట్టిస్తున్నాయి. ఆంధ్రా, తెలంగాణలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతుండటంతో ఏ స్థాయిలో ప్రాణనష్టం కలుగుతుందోనన్న భయం వెంటాడుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఓ వైపు భానుడు భగభగలతో ప్రజలు ఉక్కపోత.. మరోవైపు వివిధ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలతో(Heavy Rains) ఇబ్బందిపడుతున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వలన ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అనంతరం, తూర్పుగోదావరి, చిత్తూరు, కర్నూలు జిల్లాలో పలు చోట్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం కుడేరు మండలం చోళ సముద్రం గ్రామం లో కొబ్బరి చెట్టు పై పిడుగు పడింది భారీ శబ్దం తో పడిన పిడుగు దెబ్బకు జనం హడలి పోయారు. అయితే ఎవరికీ ఎటువంటి నష్టం వాటిల్లలేదు కానీ చెట్టు మొత్తం భారీగా మంటలు చెలరేగాయి .మొత్తం మీద భానుడి ప్రతాపం తో ఎండ వేడి నుండి ప్రజలకు ఈ వర్షం చల్లటి ఉపశమనం కలిగించింది.
ఇవి కూడా చదవండి: AP: ఫీజు కట్టాలంటూ అందరి ముందు అవమానించారు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారులు..