Kakinada: హోటల్‌కెళ్లి ఇష్టంగా పునుగులు తిన్నారు.. ఇంటికెళ్లిన కాసేపటికే.. ఇది పరిస్థితి

కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. గ్రామంలోని ఓ హోటల్‌ పునుగులు తిన్న సుమారు 50 మంది గ్రామస్తులు ఫుడ్‌ పాయిజన్ కారణంగా హాస్పిటల్‌కు పాలయ్యారు. హోట్‌లో పునుగులు తిన్న తర్వాత కడుపునొప్పితో బాధపడడంతో వారిని హాస్పిటల్‌కు తరలించారు చికిత్స అందించారు కుటుంబ సభ్యులు.

Kakinada: హోటల్‌కెళ్లి ఇష్టంగా పునుగులు తిన్నారు.. ఇంటికెళ్లిన కాసేపటికే.. ఇది పరిస్థితి
Kakinada Food Poisoning

Edited By:

Updated on: Jun 28, 2026 | 7:51 PM

పునుగులు తిన్న తర్వాత సుమారు 50 మంది గ్రామస్తులు ఫుడ్‌పాయిజన్ కారణంగా హాస్పిటల్‌ పాలైన ఘటన కాకినాడ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కాజులూరు మండలం దుగ్గుదుర్రు గ్రామంలో కాక అనే హోటల్లో ఉంది. అయితే శనివారం సాయంత్రం ఆ హోటల్‌లో పునుగులు తిన్న సుమారు 50 మంది గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. వారంతా రాత్రి కడుపునొప్పి, వాంతులు విరేచనాలతో బాధపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు వారందనిరి గ్రామంలోని ప్రాథమిక చికిత్స కేంద్రానికి తరలించి అక్కడ చికిత్స అందించారు.

వారిని పరీక్షించిన వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో వారంతా ప్రాణాయ పాయ పరిస్థితి నుంచి బయటపడ్డారు. అందరూ ఒకేసారి అస్వస్థతకు గురవ్వడానికి కారణంగా.. వారు తిన్న ఆహారమేనని వైద్యులు నిర్ధారించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న కాకినాడ డీఎంహెచ్‌ఓ నాయక్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అక్కడున్న వైద్యులకు సూచించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us