DMHO Kadapa Specialist Doctors Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కడప జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల (Specialist Doctor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 52
పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు
ఖాళీల వివరాలు:
అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ: 5
జీరియాట్రిక్: 6
ఈఎన్టీ: 6
పీడియాట్రిక్స్: 5
స్కిన్: 6
ఆర్థోపెడిక్స్: 5
చెస్ట్: 7
ఎస్‌సీడీ: 8
జనరల్ స్టడీ: 4
పే స్కేల్: నెలకు రూ.1,10,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించరాదు.
అర్హతలు: ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్/డీఎన్బీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: District Medical and Health Office, YSR Kadapa District, AP.
ఇంటర్వ్యూ తేదీ: 2022, మార్చి 26 నుంచి 31 వరకు జరుగుతాయి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: