భారత పారిశ్రామిక రంగానికి అతను ఓ పర్యాయపదం.. పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా.. అటువంటి మేలు శిఖరం ఇక ఈ లోకంలో లేదన్న చేదు నిజం అందరినీ కలిచివేస్తోంది. విశాఖకు చెందిన ప్రముఖ చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ వేసిన కళా రూపాన్ని రతన్ టాటాకు అంకితమిద్దామని సిద్ధమయ్యాడు. ఇంతలోనే ఇలా ఈ లోకాన్ని రథం టాటా వీడి వెళ్లడంతో ఆ చిత్రకారుడు నివాళులర్పించాడు.
సహజంగా చిత్రకారులు కళాకారులు వాళ్ల అభిరుచులకు అనుగుణంగా కళాఖండాలు తయారుచేస్తారు. మోకా విజయ్ కుమార్ మాత్రం కాస్త భిన్నం. చిత్రకళతో అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించడంతోపాటు.. పదిమందికి ఆ చిత్రకళను నేర్పుతూ.. చిత్రకళతో దేశమంతా ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో చిత్రాలు వేస్తున్నాడు మోకా విజయ్ కుమార్. ఆరోగ్యకరమైన చిరుధాన్యాలపై అవగాహన కల్పిస్తూ.. మిల్లెట్స్‌తో వందల చిత్రాలు రూపొందించాడు.
మోకా విజయ్ కుమార్ అనేక ప్రముఖుల చిత్రపటాలు తన స్వహస్తలతో తీర్చిదిద్దాడు. అది కూడా చిరుధాన్యాలతో చక్కగా రూపొందించాడు. భారత పారిశ్రామిక దిగ్గజం రథం టాటా చిత్రపటాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దాడు మోకా విజయ్ కుమార్. ఐదు రకాల చిరుధాన్యాల వినియోగించి.. 12 రోజుల పాటు శ్రమించాడు. కొర్రలు, సామలు, రాగులు, నల్ల సామలు, అరికెలు వినియోగించి అద్భుతమైన కళాఖండాన్ని తీర్చిదిద్దాడు. రతన్ టాటాకు బహుమతిగా ఇచ్చేందుకు మెయిల్ కూడా చేసి.. అతని అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తున్నాడు. ఇంతలోనే రతన్ టాటా ఇలా కనుముయడం తనను కలచివేసిందని అంటున్నాడు. అవకాశం ఇస్తే రతన్ టాటా కుటుంబానికి ఈ చిత్రాన్ని అందజేసి తన వంతు నివాళులర్పిస్తారని విజయ్ తెలిపాడు. విశాఖకు చెందిన విజయ్ కుమార్ రైల్వే ఉద్యోగి. చిన్నప్పటి నుంచి కళలు అంటే ఇష్టం. ఎన్నో రకాలైన కలలో కలఖండాలు తయారు చేసి అందరి మన్ననలు పొందారు.