
ఆంధ్రప్రదేశ్‌కు రెయిన్ అలెర్ట్ వచ్చేసింది. మరోసారి వానలు కుమ్మేయనున్నాయి. 4 డిసెంబర్ 2022 నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలోకి తుపాను ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో 5వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం & దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది డిసెంబర్ 7 ఉదయం నాటికి పశ్చిమ వాయువ్యంగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత, ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ డిసెంబర్ 8 ఉదయం నాటికి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. ఇక దిగువ ట్రోపోస్పిరిక్ నార్త్ ఈస్టర్ / ఈస్టర్ గాలులు ఆంధ్రప్రదేశ్, యానాం మీదుగా ఉన్నాయి. దీంతో ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇంకొన్ని చోట్ల చెదురుమదురు జల్లులు పడే అవకాశం ఉంది. దీంతో వరి, పత్తి, మిర్చి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :–
ఈ రోజు, రేపు, ఎల్లుండి :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వానలు పలు ప్రాంతాల్లో చోట్ల కురిసే చాన్స్ ఉంది
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
ఈ రోజు :- చెదురుమదురు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే సూచనలు ఉన్నాయి
రేపు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే చాన్స్ ఉంది
ఎల్లుండి:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే సూచనలు ఉన్నాయి. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే సూచనలు ఉన్నాయి. మెరుపులతో కూడిన ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
రాయలసీమ :-
ఈ రోజు: వెదర్ పొడిగా ఉండే చాన్సస్ ఉన్నాయి. ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో జల్లులు పడొచ్చు
రేపు:- చెదురుమదురు జల్లలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది
ఎల్లుండి:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే చాన్స్ ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే సూచనలు ఉన్నాయి
మరిన్న ఏపీ న్యూస్ కోసం