
అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో సౌత్ కోస్ట్ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ వ్యాప్తంగా సుమారు 26 స్టేషన్లలో హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. అలాగే వార్‌రూమ్‌లు సిద్ధం చేసింది. తుఫాన్ ప్రభావంతో ప్రమాదానికి గురయ్యే రైల్వే ట్రాక్‌లను అంచనా వేసి వాటి పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దించింది. అంతేకాకుండా విజయవాడలో వందకు పైగా రైళ్ల రద్దు చేసింది. 50కిపైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 40కిపైగా ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసినట్టు రైల్వే శాఖ తెలిపింది.
ముఖ్యంగా తెలుగురాష్ట్రాలు, ఇతర ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే గోదావరి, గౌతమి, విశాఖ, ఫలక్‌నుమా, నర్సాపూర్, గరీబ్ రథ్, మరికొన్నింటితో సహా విశాఖపట్నం వైపు వెళ్లే రోజువారీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు అటు దక్షిణ మధ్య రైల్వే (SCR ) ప్రకటించింది.
రైళ్ల గురించిన తాజా సమాచారం
ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు IRCTC, RailOne, NTES వంటి అధికారిక రైల్వే ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా లేదా 139 రైల్వే విచారణ నంబర్‌కు ఫోన్ చేసి తాజా రైలు సమాచారాన్ని తెలుసుకోవచ్చని పేర్కొంది. రైళ్ల రద్దు, దారి మళ్లింపు, పునఃప్రణాళికకు సంబంధించిన తాజా సమాచారాన్ని SMS, రైల్వే సోషల్ మీడియా హ్యాండిల్స్, SCR వెబ్‌సైట్ ద్వారా కూడా తెలియజేస్తామని ప్రకటించింది.
పోస్ట్ చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.