Viral News: గాల్లో పార్క్ చేసిన టాటా సుమో.. ఆకాశంలో ఈదుతున్న చేప.. దగ్గరకు వెళ్లి చూడగా

సాధారణంగా ఎవరైనా ఇల్లు కట్టుకుంటే, పైన వాటర్ ట్యాంక్ కట్టుకోవడం సహాజం. అయితే ఇందుకోసం ప్లాస్టిక్ సిన్‌టెక్స్‌లు లేదా సిమెంట్ దిమ్మెలను కట్టాలనుకుంటారు. కానీ ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని కొందరు యజమానులు మాత్రం అలా రొటీన్‌గా కాకుండా కొత్తగా వాటర్ ట్యాంక్‌లను నిర్మించుకుంటున్నారు. తమ ఇంటిపై ట్యాంకులను చూడగానే అరే.. భలే ఉందే అనిపించేలా వెరైటీగా నిర్మించారు.

Viral News: గాల్లో పార్క్ చేసిన టాటా సుమో.. ఆకాశంలో ఈదుతున్న చేప.. దగ్గరకు వెళ్లి చూడగా
Unique Water Tanks

Edited By:

Updated on: Apr 14, 2026 | 7:29 PM

ప్రకాశం జిల్లాలో ఓ యాజమాని చేసిన ఆలోచనా ఇప్పుడు అందరికి దృష్టిని ఆకర్షిస్తుంది. అందిరిలా కాకుండా అతను తన ఇంటిపై సరికొత్తగా టాటా సుమో ఆకారంలో వాటర్ ట్యాంక్‌ను నిర్మించుకున్నాడు. ఊర్లోకి వెళ్లగా ఆ ఇంటి పై టాటా సుమో కారు తేలుతున్నట్లుగా అనిపిస్తుంది. దూరంగా ఉన్నవాళ్లు చూస్తే.. నిజంగానే కారును ఇంటిపై పార్క్ చేశారేమో అనే కనిపిస్తుంది ఆ దృశ్యం. దగ్గరికి వెళ్లి చూస్తే తప్ప అది టాటా సుమో కాదు వాటర్ ట్యాంక్ అని అర్థమవుతుంది.

90వ దశకంలో టాటా సుమో వాహనానికి ఎంతటి క్రేజ్ ఉండేదో అందరికీ తెలిసిందే. ఆ సమయంలో ఆ వాహనంపై ఉన్న మక్కువతో, సదరు ఇంటి యజమాని తన ఓవర్ హెడ్ ట్యాంకును అచ్చం టాటా సుమో ఆకారంలోనే నిర్మించారు. టైర్లు, విండోస్, వెనుక వైపు ఉండే స్పేర్ వీల్.. ఇలా ప్రతి చిన్న విషయాన్ని ఎంతో శ్రద్ధగా చెక్కించారు. దశాబ్దాలు గడిచినా నేటికీ ఈ ట్యాంక్ అటుగా వెళ్లే వారిని ఆకర్షిస్తూనే ఉంది.

ఇదే కాదే పక్కనే ఉన్న మరో వీధిలో ఒక ఓ ప్రకృతి ప్రేమికుడు తన ఇంటిపై అచ్చం చేప ఆకారంలో వాటర్ ట్యాంకును నిర్మించారు. ఆకాశంలో చేప ఈదుతున్నట్లుగా కనిపించే ఈ ట్యాంక్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతోంది. ఇంటికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఇవ్వడంతో పాటు, చూసేవారికి ఆహ్లాదాన్ని పంచేలా ఈ ట్యాంకుల నిర్మాణం జరిగింది. ఆధునిక కాలంలో రకరకాల డిజైన్లు వస్తున్నా, అప్పట్లోనే ఇంతటి క్రియేటివిటీని చూపించిన ఈ యజమానుల ఆలోచనా విధానాన్ని స్థానికులు ప్రశంసిస్తున్నారు. మీరు కూడా అద్దంకి వెళ్తే, ఆకాశంలో ‘పార్క్’ చేసి ఉన్న ఆ సుమోను, గాలిలో ఈదుతున్న ఆ చేపను ఒకసారి లుక్కేయండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us