Vizag: విశాఖ నుంచే పరిపాలన.. మరోసారి స్పష్టం చేసిన సీఎం

టీడీపీ.. వ్యవస్థ ఎంత దిగజారిందో అనడానికి గీతాంజలి ఆత్మహత్య ఘటనే ఉదాహరణ అన్నారు సీఎం జగన్. దాడులకు భయపడేది లేదన్నారు. సీఎం వచ్చి నేరుగా విశాఖలో కూర్చుంటే.. బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నైతో పోటీ పడే స్థాయికి వెళ్తుందన్నారు.

Vizag: విశాఖ నుంచే పరిపాలన.. మరోసారి స్పష్టం చేసిన సీఎం
CM YS Jagan
Follow us

|

Updated on: Apr 23, 2024 | 3:07 PM

తనకు తగిలిన గాయంపై ఏపీ సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దాడినుంచి ప్రాణాలతో బయటపడ్డానంటే, దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్‌ రాయబోతున్నాడని సోషల్‌ మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారాయన. తనకు భయం లేదనీ, 175 సీట్లలో గెలుపు ఖాయమని జగన్‌ చెప్పారు.

విశాఖ నుంచే పరిపాలన చేస్తామంటున్న ఏపీ సీఎం జగన్‌, ఈ విషయంపై ఎన్నికల ముందు మరోసారి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. విశాఖ అనేది ఏపీకి సిటీ ఆఫ్‌ డెస్టినీ అనీ, సోషల్‌ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో చెప్పారాయన. ముఖ్యమంత్రి విశాఖ సిటీలో వచ్చి కూర్చుంటే, ఇక్కడినుంచి పరిపాలన చేస్తే, ఐటీలో ఇతర నగరాలతో పోటీపడుతుందన్నారు.

సోషల్‌ మీడియాలో వేధింపులకు గురి చేస్తే కచ్చితంగా బాధ్యులపై చర్యలు ఉండేలా యాక్షన్ ప్లాన్‌ ఉండాలన్నారు జగన్. ఓటమి భయంతో విపక్షాలు దాడులకు దిగుతున్నాయన్నాయని.. తనపైనా అందుకే దాడి చేశారని అన్నారు.

– తెనాలిలో ఇంటిపట్టా పొంది ఆనందంలో ఉన్న గీతాంజలి అనే మహిళ ట్రోలింగ్‌తో ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని సీఎం జగన్‌ ప్రస్తావించారు. గీతాంజలిని ఎంత దారుణంగా ట్రోల్ చేసి వేధించారో చూశామనీ, వ్యవస్థ ఎంత దిగజారిందనే దానికి గీతాంజలి ఆత్మహత్యే నిదర్శనమన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…   

Latest Articles