CM Jagan: నేడే జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల.. తల్లుల ఖాతాల్లో రూ.694కోట్లు జమ..

జగనన్న విద్యాదీవెన పథకం నిధులను సీఎం జగన్ ఇవాళ (బుధవారం) విడుద చేయనున్నారు. జూలై–సెప్టెంబర్‌ కు సంబంధించిన ఫండ్స్ ను ముఖ్యమంత్రి రిలీజ్ చేస్తారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించే...

CM Jagan: నేడే జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల.. తల్లుల ఖాతాల్లో రూ.694కోట్లు జమ..
Cm Jagan
Follow us

|

Updated on: Nov 30, 2022 | 7:20 AM

జగనన్న విద్యాదీవెన పథకం నిధులను సీఎం జగన్ ఇవాళ (బుధవారం) విడుద చేయనున్నారు. జూలై–సెప్టెంబర్‌ కు సంబంధించిన ఫండ్స్ ను ముఖ్యమంత్రి రిలీజ్ చేస్తారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేస్తారు. ఆర్థిక స్తోమత లేనందున చాలా మంది చిన్నారులు పాఠశాలకు రావడం లేదు. వీరి ఇబ్బందులు, పరిస్థితులు గమనించిన జగన్ ప్రభుత్వం విద్యా దీవెన పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదని ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశ్యం. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటును ప్రభుత్వమే అందిస్తోంది. ఈ ఫీజులను ప్రతి త్రైమాసికం క్యాలెండర్‌ ప్రకారం విడుదల చేయడంతో కాలేజీలకూ ప్రయోజనం లభిస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో పేద విద్యార్థుల చదువుల కోసం ఖర్చు చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదనే చెప్పాలి. ఎలాంటి అవాంతరాలు లేకుండా అభ్యసించేందుకు పరిమితులు విధించకుండా ఈ పథకాలను అందిస్తున్నారు.

ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. పేద విద్యార్థులు భోజనం, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా జగనన్న వసతి దీవెన పథకం కింద ఏటా 2 వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించేవారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు.

మరోవైపు.. ఉపాధ్యాయులను ప్రభుత్వం ఎన్నికల విధుల నుంచి తప్పించింది. విద్యా హక్కు చట్టం అమలుకు అనుగుణంగా 2011 మార్చి 3 న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు-20ను సవరించింది. ఉపాధ్యాయులకు బోధనేతర పనులను అప్పగించవద్దని ఆదేశాల్లో పేర్కొంది. విద్యకు సంబంధించిన కార్యకలాపాలకే పరిమితం చేయాలని సూచించింది. అయితే.. ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు దూరంగా పెట్టేందుకు, ఎన్నికల విధులకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని వినియోగించేందుకు ఈ సవరణ తీసుకొచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..