Amalapuram: తాటి ముచ్చికతో మాస్క్.. బుడ్డోడు భలే షార్ప్

|

Aug 01, 2021 | 3:13 PM

తాటి ముంజలు అంటే ఇష్టం ఉండనివారు ఎవరుంటారు చెప్పిండి. లేత, లేత ముంజలను ముందు పెడితే అందరూ లొట్టలేసుకుంటూ...

Amalapuram: తాటి ముచ్చికతో మాస్క్.. బుడ్డోడు భలే షార్ప్
Boy Mask
Follow us on

తాటి ముంజలు అంటే ఇష్టం ఉండనివారు ఎవరుంటారు చెప్పిండి. లేత, లేత ముంజలను ముందు పెడితే అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. ఎండకాలం సీజన్‌లో ఇవి లభిస్తాయి. తాటి ముంజలు తింటే.. చలవ చేయడం మాత్రమే కాదు ఎన్నో పోషకాలు కూడా లభిస్తాయి. జీర్ణ శక్తి కూడా మెరుగుపడుతుంది. ఇక పండిన తాటి పండ్లతో కమ్మటి తాటి రొట్టెలు, గారెలు ఇంకా రకరకాల వంటకాలు చేస్తారు. అయితే తాటి కాయల పైనే ఉండే ముచ్చికతో ఒక బుడ్డోబు జబర్దస్త్ మాస్క్ తయారు చేశాడు.

అవును తాటి ముచ్చికతో మాస్క్ తయారు చేయవచ్చని ఈ చిన్నోడు నిరూపించాడు. ఈ బుడ్డోడు తన దిమాక్‌లో వచ్చిన ఆలోచనతో మంచి ప్రయత్నమే చేశాడు. ఇంటి వెనుక పెరట్లో పడేసిన ముచ్చికలు ఏరుకొచ్చి క్రియేటివ్‌గా ఆలోచించి తాటి మాస్క్ తయారు చేశాడు. అంతేకాదు ఈ మాస్కులు ఎకో ఫ్రెండ్లీ అని కూడా చెబుతున్నాడు. ఈ మాస్కు వాడినాక ఎక్కడ పడేసినా పర్యావరణానికి హాని ఉండదని చెబుతున్నారు.  తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన తనీష్ అనే బాలుడు ఈ క్రియేటివ్ థాట్‌లో స్థానికులు అటెన్షన్ గ్రాబ్ చేశాడు. ఇప్పుడే ఇలా ఉంటే ఫ్యూచర్‌‌లో ఈ చిన్నోడు అద్బుతాలు చేస్తాడని నమ్ముతున్నారు గ్రామస్థులు.

Also Read: మంచి మనసు చాటుకున్న సీఎం జగన్.. చనిపోయిన ఒడిశా కూలీల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

 కన్న కొడుకును చంపేందుకు తండ్రి ప్లాన్.. ఎందుకో తెలిస్తే షాక్