Vegetable Price: భారీగా పడిపోయిన టమాటా ధర.. క్యారెట్, బీట్ రూట్ కూడా పతనం.. కిలో ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు పడిపోయాయి. టమాటా ధరలు మరింతగా తగ్గాయి. ప్రస్తుతం కిలో రూ.10కే లభిస్తున్నాయి. ఇక క్యారెట్, బీట్ బీట్ రూట్ ధరలు కూడా భారీగా పడిపోయాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Vegetable Price: భారీగా పడిపోయిన టమాటా ధర.. క్యారెట్, బీట్ రూట్ కూడా పతనం.. కిలో ఎంతంటే..?
Vegetable Prcies

Updated on: Feb 22, 2026 | 7:47 PM

సామాన్యులకు పెద్ద ఊరట లభించింది. పలు కూరగాయల ధరలు భారీగా పడిపోయాయి. రోజు ఇంట్లోకి ఉపయోగించే టమాటాతో పాటు క్యారెట్, బీట్రూట్ ధరలు కుప్పకూలాయి. గత రెండు నెలల క్రితం కేజీ టమాటా రూ.30 వరకు పకలగా.. ఇఫ్పుడు ఏకంగా రూ.10కి పతనమమైంది. ఇక కేజీ రూ.100 పలికే క్యారెట్, బీట్ రూట్ ధరలు కూడా ఒకేసారి తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం కేజీ రూ.30లోపే లభిస్తున్నాయి. ఇక రైతు మార్కెట్లో అయితే మరింత తక్కువకు దొరుకుతున్నాయి. దీని వల్ల సామాన్యుడికి నెలవారీ అయ్యే ఖర్చు తగ్గిపోతుంది.

హైదరాబాద్‌లో ధరలు

రైతు మార్కెళ్లల్లో కేజీ టమాట రూ.10కే లభిస్తున్నాయి. వీధుల్లో ఏర్పాటు చేసే సంతల్లో కూడా ఇవే ధరలు పలుకుతున్నాయి. ఇక బీరకాయ రూ.40, క్యాబేజీ రూ.12, క్యాలీఫ్లవర్ రూ.25, క్యారెట్ రూ.20, దొండకాయ రూ.50, బీన్స్ రూ.30, పచ్చి మిర్చి రూ.60, ఉల్లిగడ్డ రూ.18, సొరకాయ రూ.15, క్యాప్చికం రూ.40కి లభిస్తున్నాయి. ఇక బెండకాయ రూ.28, కాకరకాయ రూ.38, క్యారెట్ రూ.21, చిక్కుడుకాయ రూ.35, గొకర రూ.28, కీరదోస రూ.18, బీట్ రూట్ రూ.15, చామ రూ.33, ఆలు రూ.16, గోబీ రూ.13, పొట్ల రూ.18 పలుకుతున్నాయి.

విజయవాడలో ధరలు ఇలా..

విజయవాడలో కిలో టమాటా రూ.10, వంగ రూ.20, బెండకాయ రూ.24, పచ్చిమిర్చి రూ.44, కాకరకాయ రూ.30, క్యాబేజీ రూ.16, క్యారెట్ రూ.24, దొండకాయ రూ.33, బంగాళదుంప రూ.23, ఉల్లిపాయలు రూ.22, గోరుచిక్కుడు రూ.26, దోసకాయ రూ.27, సొరకాయ రూ.10, చిక్కుళ్లు రూ.26, బీరకాయ రూ.24, చామదుంప రూ.24, కంద రూ.40, బీట్ రూట్ రూ.26, కీరదోస రూ.40, బీన్స్ రూ.60, క్యాప్చికం రూ.64, అలసందలు రూ.24, చిలకడదుంప రూ.30 పలుకుతున్నాయి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us