School Holidays: సైక్లోన్ మురసు ఎఫెక్ట్.. ఈ జిల్లాలో అతి భారీ వర్షాలు, స్కూళ్లకు సెలవులు

Cyclone Murasu Impact: Schools Declared Closed ఏపీని మురసు తుఫాన్ వణికిస్తోంది. గంటలకు 25నుంచి 30కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుచ్చిన ఈ తీవ్ర తుఫాన్ అర్థరాత్రి. నెల్లూరు–నరసాపూర్ మధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని తాకింది. ప్రస్తుతం అక్కడే కేంద్రకృతమై ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుఎన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్‌ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు.

School Holidays: సైక్లోన్ మురసు ఎఫెక్ట్.. ఈ జిల్లాలో అతి భారీ వర్షాలు, స్కూళ్లకు సెలవులు
yclone Murasu Impact: Schools Declared Closed

Updated on: Nov 03, 2026 | 7:15 AM

Cyclone Murasu Alert: అర్నబ్ తుఫాన్ బీభత్సం మరువకముందే.. ఏపీకి మురసు తుఫాన్ ముప్పు ముంచెత్తింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా ఆ తర్వాత తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెంది. గంటలకు 25నుంచి 30కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుచ్చిన ఈ తీవ్ర తుఫాన్ అర్థరాత్రి. నెల్లూరు–నరసాపూర్ మధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని తాకింది. తాజాగే తీరాన్ని దాటింది. తుఫాన్‌ తీరం దాటుతున్నందు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని తీర ప్రాంతాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముక్యంగా కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాదు రాబోయే రెండ్రోజుల పాటు కూడా ఈ భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతవరణ శాఖ అంచనా వేసింది.

దీంతో.. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే.. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్‌ జారీ చేసింది. ఈ ఏడు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కరుస్తాయని తెలిపింది.

ఇదిలా ఉండగా భారీ వర్షాల నేపథ్యంలో నేడు ఎన్టీఆర్‌ జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని.. ఆ ప్రాంతంలోని పలు కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో అత్యధిక వర్ష పాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని.. ఆ జిల్లా వాసులు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్న అధికారు హెచ్చరించారు.

వీడియో చూడండి..


మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Loading...
Unable to load recommendations.
Follow Us