Weather Report: దూసుకొస్తున్న అల్పపీడనం.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

ఏపీ, తెలంగాణ వాసులకు వాతావరణ కేంద్ర కీలక సూచనలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంతిని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాబట్టి ఈ రోజులు ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.

Weather Report: దూసుకొస్తున్న అల్పపీడనం.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
Latest Weather Report For Ap And Telangana

Updated on: Oct 23, 2026 | 6:00 AM

ఏపీ, తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. అండమాన్ పరిసరప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని దీని ప్రభావంతో.. ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆ తర్వాత ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులురూ ఆది, సోమవారాల్లో వాయుగుండంగా రుపాంతరం చెంది ఆ తరువాత 2-3 రోజుల్లో మరింత బలపడి కోస్తాంధ్ర తీరానికి సమీపంలోకి చేరే అవకాశం ఉందని వెల్లడించారు.

దీని ప్రభావంతో ఆదివారం రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, , రాష్ట్రంలో సోమవారం నుంచి మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపిఎస్డిఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆదివారం నుండి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, అలాగే వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ లోపు తీరానికి తిరిగిరావాలని హెచ్చరించారు.

శుక్రవారం (23-10-2026) మన్యం , అల్లూరి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ; మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

తెలంగాణలో వాతావరణం ఇలా

బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం వాయుగుండగా, గంటకు 160-200 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో కూడిన తీవ్రమైన తుపానుగా మారే అవకాశం ఉందని.. అక్టోబర్ 28న ఇది అత్యంత ప్రమాదకరమైన తుపానుగా మారి, మధ్య ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. సుమారు 3 ఏళ్ల తర్వాత, బంగాళాఖాతంలో ఒక తీవ్రమైన తుపాను ఏర్పడి, తూర్పు భారత తీరం వైపు పయనిస్తోందని అంచానా వేశారు.

దీని ప్రభావంతో అక్టోబర్ 29 నుండి 31 వరకు తూర్పు తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు పడవచ్చుని తెలిపారు. అలాగే ఇతర జిల్లాల్లో తేలిక పాటి వర్షాలు కురసే ఛాన్స్ ఉందని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us