
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం సూపర్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ పెంచన్ల పంపిణీకి సంబంధించి ఇటీవలే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్పౌజ్ కేటగిరి కింద రాష్ట్రంలో కొత్తగా 7,792 మందికి పింఛన్లు మంజూరు చేనట్టునున్నట్టు తెలిపింది. అందిరితో పాటు వీరికి కూడా జూలై 1వ తేదీ నుంచే పించన్ల పంపిణీ చేయనున్నట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. వచ్చే నెల 1వ తేదీని అందించ పింఛన్ల కోసం ఇప్పటికే రూ.2,711 కోట్ల నిధులు కూడా విడుదల చేసినట్టు ఆయన తెలిపారు. ఈ నిధుల ద్వారా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 62,19,648 మంది పింఛన్‌దారులకు లబ్ధిపొందనున్నట్టు తెలిపారు..
ఇక స్పౌజ్ కేటగిరీ కింద రాష్ట్రంలోని 7,792 మందికి కొత్త పించన్లు అందించేందుకు రూ. 3.12 కోట్లను కూడా ఇప్పటికే విడుదల చేసినట్లు మంత్రి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కేవలం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసమే రూ. 68,598.44 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే వితంతు పించన్ల మంజూరుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోందని.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.20లక్షల మంది ఈ కేటగిరి కింద అర్హులుగా ఉన్నట్టు గుర్తించామన్నారు. మరో రెండు నెలల్లో వితంతు పింఛన్లు కూడా అందించేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
స్పౌజ్ పించన్లు అంటే ఏమిటి?
ప్రభుత్వం కొత్తగా అందిస్తున్న స్పౌజ్ పింఛన్‌లు అంటే.. ప్రభుత్వం నుంచి ఇప్పటికే పింఛన్ తీసుకుంటున్న వ్యక్తి మరణిస్తే.. ఆ పింఛన్‌ను అతని భార్యకు అందిస్తారు. పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబానికి ఆసరగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం స్పౌజ్ కేటగిరి కింద.. వారికి నెలకు రూ.4వేలు అందజేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.