Nellore Municipal: నెల్లూరు మేయర్‌గా టీడీపీ అభ్యర్థి రూప్‌కుమార్‌ యాదవ్‌ విజయం

AP Nellore Municipal Mayor Profile: ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి దూసుకుపోతోంది. ఇక నెల్లూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ దుమ్ము లేపుతోంది. వరుసగా సీట్లు కైవసం చేసుకుంటూ వైసీపీకి షాకిస్తోంది. నెల్లూరు మేయర్‌గా తెదేపా అభ్యర్థి రూప్‌కుమార్‌ యాదవ్‌..

Nellore Municipal: నెల్లూరు మేయర్‌గా టీడీపీ అభ్యర్థి రూప్‌కుమార్‌ యాదవ్‌ విజయం
Ap Nellore Municipal

Updated on: Nov 03, 2026 | 8:12 PM

AP Nellore Municipal Mayor Profile: ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి దూసుకుపోతోంది. ఇక నెల్లూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ దుమ్ము లేపుతోంది. వరుసగా సీట్లు కైవసం చేసుకుంటూ వైసీపీకి షాకిస్తోంది. నెల్లూరు మేయర్‌గా తెదేపా అభ్యర్థి రూప్‌కుమార్‌ యాదవ్‌ విజయం సాధించారు. ఆత్మకూరు మున్సిపాలిటీని టీడీపీ అభ్యర్థి బొమ్మిరెడ్డి షకీలా 2,206 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

రూప్‌కుమార్‌ యాదవ్‌ గతంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్‌గా సుదీర్ఘ అనుభవం కూడా ఉంది. అంతేకాకుండా, గతంలో కొన్ని రోజులుగా నెల్లూరు కార్పొరేషన్ ఇన్‌చార్జ్ మేయర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే నవంబర్ 1న జరిగిన ఈ ఎన్నికల్లో 57.72 శాతం పోలింగ్ నమోదైంది. (గతంలో 2021 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది).

ఇక వెంకటగిరిలో టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి దొంతు శారద 10,636 ఓట్లతో గెలుపొందగా, సూళ్లూరుపేటలో టీడీపీ అభ్యర్థి పిట్ల సుహాసిని 8,306 ఓట్ల మెజారిటీతో చైర్‌పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. బుచ్చిరెడ్డిపాళెంలో టీడీపీ అభ్యర్థి దొడ్ల విజయలక్ష్మి 3,543 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక నాయుడుపేటలో వైసీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ 1,473 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, మరో 1,400 ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఈ క్రమంలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగడంతో ఎన్నికల అధికారులు తాత్కాలికంగా కౌంటింగ్‌ను నిలిపివేశారు కొంత సేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

Loading...
Unable to load recommendations.
Follow Us