AP Municipal Elections 2021 Live: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. 60 శాతానికిపైగా ఓటింగ్ నమోదు

AP Municipal Elections 2021 Live: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. 60 శాతానికిపైగా ఓటింగ్ నమోదు

|

Mar 10, 2021 | 8:48 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికాసేపట్లో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ‌ సజావుగా సాగింది. ఉదయం 7గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభం కాగా.. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాల వద్దకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 53.57శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ‌ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభం కాగా.. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాల వద్దకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 53.57శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.

బ్యాలెట్‌ బ్యాక్సులో ఓటరు తీర్పు పడింది. ఈ నెల14న కౌంటింగ్.. పంచాయతీ ఎన్నకల తర్వాత జరిగిన ఈ ఎన్నికలు ఎలాంటి తీర్పు వస్తుందని ఉత్కంఠ నెలకొంది. పార్టీ గుర్తులపై జరిగిన ఈ ఎన్నికల్లో అధికార పార్టీ సంక్షేమ పాలనకు పట్టం కట్టారా? లేక ప్రతిపక్షాలకు చాన్స్‌ ఇస్తారా? అనేది మార్చి14న తేలనుంది.

గెలుపు గుర్రాలెవరో శనివారం తేలిపోనున్నది. ఎవరు గెలుస్తారో..? ఎవరు ఓడతారో..? తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ఇదే అంశంపై బెట్టింగ్ రాయుళ్లు సైతం బరిలో దిగినట్లు సమాచారం. రూ.వేల నుంచి లక్షల వరకు పందేలు కాస్తున్నారని తెలుస్తున్నది. ఇలాంటి వార్డుల్లో బెట్టింగ్ జోరుగా సాగుతోందని సమాచారం. ఎవరు గెలుస్తారనే అంశంపై మరో మూడు రోజుల పాటు ఉత్కంఠ నెలకొననున్నది. అభ్యర్థుల భవితవ్యం మాత్రం స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉంది.

రాష్ట్ర వ్యాప్తంగా 12 కార్పొరేషన్లు, 71 పురపాలికల్లో పోలింగ్‌ జరిగింది. ఈ మధ్యాహ్నం 3గంటల వరకు 53.57శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. జిల్లాల వారీగా నమోదైన పోలింగ్‌ వివరాలు ఇలా ఉన్నాయి..

శ్రీకాకుళం జిల్లాలో                            59.93 శాతం
విజయనగరం                                    56.63శాతం
విశాఖ                                                  47.86శాతం
తూర్పుగోదావరి                                    66.21శాతం
పశ్చిమగోదావరి                                    53.68శాతం
కృష్ణా                                                     52.87శాతం
గుంటూరు                                           54.42శాతం
ప్రకాశం                                                 64.31శాతం
నెల్లూరు                                            61.03శాతం
అనంతపురం                                 56.90శాతం
కర్నూలు                                         48.87శాతం
కడప                                             56.63శాతం
చిత్తూరు                                      54.12శాతం

మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా.. 42.84 శాతం పోలింగ్ నమోదైంది.

శ్రీకాకుళం                             44.38 శాతం
విజయనగరం                      45.10 శాతం
విశాఖ                                    36.75 శాతం
తూర్పు గోదావరి జిల్లా          53.08 శాతం
పశ్చమ గోదావరి జిల్లా          45.51 శాతం
కృష్ణా                                     41.49 శాతం
గుంటూరు                            44.69 శాతం
ప్రకాశం                                 53.19 శాతం
నెల్లూరు                               48.89 శాతం
చిత్తూరు                               41.28 శాతం
అనంతపురం                      45.42 శాతం
కడప                                    46.02 శాతం
కర్నూలు                             40.99 శాతం
రాష్ట్రవ్యాప్తంగా                   42.84 శాతం

అయితే, ఇప్పటికే నాలుగు మున్సిపాలిటీలు ఏకగ్రీవం కాగా, ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికలకు హైకోర్ట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే ఫలితాలు వెల్లడించవద్దని ఉత్తర్వులు ఇచ్చింది.

కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ 71 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2,123 వార్డుల్లో 490 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 1,633 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 4,981 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 12 కార్పొరేషన్‌లలోని 671 డివిజన్లలో 89 ఏకగ్రీవం కాగా, 582 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. కార్పొరేషన్లలో 2,364 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

మొత్తం ఓటర్ల సంఖ్య 76 లక్షల, 23 వేల 43 మంది. ఇందులో పురుష ఓటర్లు 37 లక్షల 52 వేల 668 మంది కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 38 లక్షల 69 వేల 225 మంది. ఇతరులు 1,150 మంది. మున్సిపల్‌ ఎన్నికల 7,699 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. కార్పొరేషన్‌ ఎన్నికల కోసం 4,410 పోలింగ్‌ స్టేషన్లు, మున్సిపాలిటీ ఎన్నికల కోసం 3,289 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

కార్పొరేషన్‌ ఎన్నికల కోసం 25,682 మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించారు. ఇందులో పీవోలు 4,423 మంది..4,423 మంది అసిస్టెంట్‌ పీవోలున్నారు. ఇతర పోలింగ్ అధికారులు 15,166 మంది. ఇందులో రూట్‌ అధికారులు 121 మంది, జోనల్‌ అధికారులు 451 మంది, మైక్రో అబ్జర్వర్స్‌ 1,098 మంది ఉన్నారు. ఇటు, మున్సిపాలిటీ ఎన్నికల విధులకు హాజరవుతున్న సిబ్బంది సంఖ్య 21,888. ఇందులో 3277 మంది పీవోలు, 3277 మంది అసిస్టెంట్‌ పీవోలున్నారు. ఇతర అధికారులు 13002 మంది ఉన్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 10 Mar 2021 08:46 PM (IST)

    5గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 70.66శాతం పోలింగ్‌

    ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం సాయంత్రం 5గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 70.66శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా….

    తూర్పుగోదావరి జిల్లాలో 75.93శాతం, కృష్ణా 75.90శాతం పోలింగ్‌ నమోదు కాగా.. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 62.53శాతం నమోదైంది. జిల్లాల వారీగా పోలింగ్‌ శాతాలను పరిశీలిస్తే.. శ్రీకాకుళం జిల్లాలో 71.52%, విజయనగరం 74.61%, విశాఖ 74.63%, తూర్పుగోదావరి 75.93%, పశ్చిమగోదావరి 71.54%, కృష్ణా 75.90%, గుంటూరు 69.19%, ప్రకాశం 75.46%, నెల్లూరు 71.06%, అనంతపురం 69.77%, కర్నూలు 62.53%, కడప 71.67%, చిత్తూరు 69.60% చొప్పున పోలింగ్ శతాలు నమోదయ్యాయి.

  • 10 Mar 2021 05:12 PM (IST)

    ప్రశాంతంగా ముగిసింది…

    ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ‌ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభం కాగా.. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాల వద్దకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 53.57శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.

  • 10 Mar 2021 05:08 PM (IST)

    లైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం..

    ఇప్పటి వరకూ లైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశంను కల్పించారు అధికారులు. దీంతో పోలింగ్ సెంటర్ల వద్ద జనం క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సెంటర్ల వద్దకు వచ్చారు వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఇస్తున్నారు.

  • 10 Mar 2021 05:06 PM (IST)

    ప్రశాంతంగా ముగిసిన ఏపీలో మున్సిపల్ పోలింగ్

    ఏపీలో మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటలకు 60 శాతం వరకు ఓటింగ్ నమోదైంది. ఇప్పటి వరకు లైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు

  • 10 Mar 2021 05:06 PM (IST)

    ముగిసిన మున్సిపల్‌,కార్పొరేషన్ల ఎన్నికల పోలింగ్..

    మున్సిపల్‌,కార్పొరేషన్ల ఎన్నికలు ముగిశాయి. బ్యాలెట్‌ బ్యాక్సులో ఓటరు తీర్పు పడింది. ఈ నెల14న కౌంటింగ్. పంచాయతీ ఎన్నకల తర్వాత జరిగిన ఈ ఎన్నికలు ఎలాంటి తీర్పు వస్తుందని ఉత్కంఠ నెలకొంది. పార్టీ గుర్తులపై జరిగిన ఈ ఎన్నికల్లో అధికార పార్టీ సంక్షేమ పాలనకు పట్టం కట్టారా? లేక ప్రతిపక్షాలకు చాన్స్‌ ఇస్తారా? అనేది మార్చి14న తేలనుంది.

  • 10 Mar 2021 04:41 PM (IST)

    గుంటూరు జిల్లా గోరంట్లలో ఉద్రిక్తత..

    గుంటూరు జిల్లాలో పోలింగ్‌ సందర్బంగా అక్కడక్కడ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.గోరంట్లలో వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారని టీడీపీ ఏజెంట్లు ఆందోళనకు దిగారు. వైసీపీ,టీడీపీ ఏజెంట్ల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఇదే టైమ్‌లో జోక్యం చేసుకున్న పోలీసులు ఇరువర్గాలను బూత్‌ల నుంచి పంపించివేశారు.

  • 10 Mar 2021 04:11 PM (IST)

    మధ్యాహ్నం 3 గంటల వరకు 53.57శాతం పోలింగ్ నమోదు

    ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు మరో రెండు గంటలు మాత్రమే మిగిలివుంది. ఈ మధ్యాహ్నం 3గంటల వరకు 53.57శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. జిల్లాల వారీగా నమోదైన పోలింగ్‌ వివరాలు ఇలా ఉన్నాయి..

    శ్రీకాకుళం జిల్లాలో                            59.93 శాతం
    విజయనగరం                                    56.63శాతం
    విశాఖ                                                  47.86శాతం
    తూర్పుగోదావరి                                    66.21శాతం
    పశ్చిమగోదావరి                                    53.68శాతం
    కృష్ణా                                                     52.87శాతం
    గుంటూరు                                           54.42శాతం
    ప్రకాశం                                                 64.31శాతం
    నెల్లూరు                                            61.03శాతం
    అనంతపురం                                 56.90శాతం
    కర్నూలు                                         48.87శాతం
    కడప                                             56.63శాతం
    చిత్తూరు                                      54.12శాతం

  • 10 Mar 2021 04:04 PM (IST)

    కర్నూలు జిల్లాలో 3 గంటల వరకు 48.87 శాతం పోలింగ్

    కర్నూలు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లాలో 48.87శాతం పోలింగ్ నమోదైనట్లుగా కలెక్టర్ వీరపాండ్యన్ వెల్లడించారు. జిల్లాలోని అత్యధికంగా గూడూరులో 79.41 శాతం నమోదు కాగా.. ఆ తర్వాత ఆళ్లగడ్డ 72. శాతం, నందికొట్కూరు 71 .18 శాతం నమోదైనట్లుగా తెలిపారు.

  • 10 Mar 2021 04:01 PM (IST)

    3 గంటల వరకు 53.57శాతం పోలింగ్ నమోదు

    ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాతంగా సాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 53.57 శాతం పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు.

  • 10 Mar 2021 03:00 PM (IST)

    మధ్యాహ్నం 1 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా.. 42.84 శాతం పోలింగ్

    ఏపీలో పుర ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 12 కార్పొరేషన్లు, 71 పురపాలికల్లో పోలింగ్‌ జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా.. 42.84 శాతం పోలింగ్ నమోదైంది.

  • 10 Mar 2021 02:54 PM (IST)

    మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ శాతం

    ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా.. 42.84 శాతం పోలింగ్ నమోదైంది.

  • 10 Mar 2021 02:52 PM (IST)

    టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రను అడ్డుకున్న పోలీసులు

    పోలింగ్‌ స్టేషన్‌లకు కారులో ఎక్కువమందితో ప్రయాణిస్తున్నారంటూ మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు రవీంద్ర. చంపుతారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓ దశలో పోలీసు అధికారిని తోసేసిన కొల్లు.. పోలీసుల తీరుకు నిరసనగా నేల మీద కూర్చొని నిరసన తెలిపారు.

  • 10 Mar 2021 02:51 PM (IST)

    ఆళ్లగడ్డలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి అఖిలప్రియ

    కర్నూలుజిల్లాలో ఆళ్లగడ్డలో మాజీ మంత్రి అఖిలప్రియ ఓటేశారు. పోలీసులు వారించినా క్యూలో నిలుచునే ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓటేశాక పోలీసులు ఇంటిదగ్గర దించేందుకు ఒత్తిడి తీసుకురావడంపై అఖిల ఆగ్రహం వ్యక్తంచేశారు.

  • 10 Mar 2021 01:50 PM (IST)

    విశాఖలో ఒంటి గంట వరకు 36శాతం పోలింగ్

    విశాఖపట్నం జిల్లాలో మున్సిపల్ పోలింగ్ మందకొడిగా సాగుతుంది. ఇక, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 36 శాతం పోలింగ్ నమోదు అయ్యిందని ఎన్నికల అధికారులు తెలిపారు.

  • 10 Mar 2021 01:47 PM (IST)

    పోలీసులతో కొల్లు రవీంద్ర వాగ్వాదం

    కృష్ణా జిల్లాలో టీడీపీ నేత కొల్లు రవీంద్రకు పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలింగ్ స్టేషన్ వద్దకు కారులో ఎక్కువమందితో ప్రయాణిస్తున్నారంటూ కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కొల్లు రవీంద్రకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరుకు నిరసనగా నేల మీద కూర్చొని ఆయన నిరసన తెలిపారు.

  • 10 Mar 2021 01:23 PM (IST)

    పోలింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్లకు అనుమతిః ఎస్ఈసీ

    పోలింగ్ బూత్‌లలోకి సెల్‌ఫోన్లు తీసుకువెళ్లడంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ క్లారిటీ ఇచ్చారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని వచ్చే ఓటర్ల వద్ద సెల్ ఫోన్స్ ఉన్నా.. ఎటువంటి అభ్యంతరం లేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ స్పష్టం చేశారు. అయితే, ఓటు వేసేటప్పుడు మాత్రం స్విచ్ ఆఫ్ చేయాలని సూచించారు. ఈ మేరకు సెల్‌ఫోన్లను అడ్డుకోవద్దని పోలీసు అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

    SEC Nimmagadda Ramesh Kumar

     

  • 10 Mar 2021 01:15 PM (IST)

    డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఓటు గల్లంతు

    ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఓటు గల్లంతైంది. శనివారపుపేట 25వ డివిజన్ ఎంపీపీ స్కూల్ లో ఓటు వేయడానికి వచ్చిన ఆళ్ల నానికి అధికారులు షాక్ ఇచ్చారు. ఓటర్ లిస్ట్ లో ఆళ్ల నాని పేరుకు బదులు మరో మహిళ పేరు ఉండటంతో ఓటు వేయకుండానే ఆళ్ల నాని వెనుతిరిగి వెళ్లారు.

  • 10 Mar 2021 01:06 PM (IST)

    మాజీ ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసం

    గుంటూరు జిల్లా సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 24వ వార్డులో టీడీపీ వైసీపీ వర్గాల మద్య ఘర్షణ చోటచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు కారుపై వైసీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

  • 10 Mar 2021 12:16 PM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్ దంపతులు

    విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర ప్రథమ పౌరుడిగా బాధ్యతతో తాను ఓటు హక్కును వినియోగించుకున్నానని ప్రజలంతా ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

    1

  • 10 Mar 2021 12:11 PM (IST)

    ఉదయం 11 గంటల వరకు 32.23 శాతం పోలింగ్‌

    రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 32.23 శాతం పోలింగ్‌ నమోదైందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 36.12 శాతం నమోదు కాగా, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 24.58 శాతంగా నమోదు అయ్యింది. ఎప్పటికప్పుడు మున్సిపల్‌ ఎన్నికల సరళిని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఓటు వేసేందుకు జనం తరలివస్తుండటంతో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. జిల్లాల వారీగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శాతం ఇలా..

    1. కృష్ణా జిల్లా – 32.64 శాతం
    2. చిత్తూరు జిల్లా – 30.12 శాతం
    3. ప్రకాశం జిల్లా – 36.12 శాతం
    4. వైఎస్సార్‌ జిల్లా – 32.82 శాతం
    5. నెల్లూరు జిల్లా – 32.67 శాతం
    6. విశాఖ జిల్లా – 28.50 శాతం
    7. కర్నూలు జిల్లా – 34.12 శాతం
    8. గుంటూరు – 33.62 శాతం
    9. శ్రీకాకుళం – 24.58 శాతం
    10. తూర్పుగోదావరి – 36.31శాతం
    11. అనంతపురం – 31.36 శాతం
    12. విజయనగరం – 31.97 శాతం
    13. పశ్చిమ గోదావరి – 34.14
  • 10 Mar 2021 12:06 PM (IST)

    నగరిలో ఓటు హక్కు వినియోగించుకున్న రోజా

    చిత్తూరు జిల్లా నగరిలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎమ్మెల్యే రోజా. ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఓటు వేయడానికి పోలింగ్‌కు వస్తున్నారని రోజా అన్నారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి జనాలు వైసీపీకి ఓట్లు వేస్తున్నారని తెలిపారు. పంచాయతీ ఎన్నికల మాదిరే మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీ విజయం సాధిస్తుందని రోజా ధీమా వ్యక్తం చేశారు.

  • 10 Mar 2021 11:59 AM (IST)

    విశాఖలో ఓటేసిన మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ

    మాజీ సీబీఐ డైరక్టర్ వి.లక్ష్మీనారాయణ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు.

  • 10 Mar 2021 11:52 AM (IST)

    కుటుంబసమేతంగా ఓటేసిన మంత్రి వెల్లంపల్లి

    విజ‌య‌వాడ పశ్చిమ నియోజకవర్గంలోని 37 డివిజన్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు. ఓటు అనేది ఆయుధం లాంటిందని, ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాల‌ని ఆయన పిలుపునిచ్చారు.

  • 10 Mar 2021 11:48 AM (IST)

    డబ్బులు పంచుతున్నారంటూ ఘర్షణ

    బద్వేల్‌ మున్సిపాలిటీలోని 16వ వార్డులో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. డబ్బులు పంచుతున్నారని వైసీపీ – టీడీపీ నేతలు మధ్య వాగ్వివాదం జరగింది. ఈ నేపథ్యంలో గొడవ జరిగింది. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

  • 10 Mar 2021 11:04 AM (IST)

    శ్రీకాకుళం జిల్లాలో మందకొడిగా పోలింగ్

    శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న మూడు మునిసిపాలిటీల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. మందకొడిగా మొదలైన పోలింగ్ ప్రక్రియ పది గంటలకు కేవలం 8.91 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అనంతరం పెద్ద మొత్తంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద మొత్తంలో తరలి రావడంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు దేరారు.

     

  • 10 Mar 2021 10:54 AM (IST)

    భద్రత ఏర్పాట్లను పరిశీలించిన విజయవాడ సీపీ

    విజయవాడలో మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. తొలి 10 గంటల వరకు 25 శాతానికిపైగా పోలింగ్‌ నమోదైనట్టుగా విజయవాడ సీపీ శ్రీనివాస్‌రావు చెప్పారు. గత ఏడాది 63 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఈసారి ఎక్కువగా అయ్యే అవకాశముందని భావిస్తున్నామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మొహరించి .. పోలింగ్‌ను ప్రశాంత వాతావరణంలో కొనసాగేలా చూస్తున్నామని పోలీసు కమిషనర్ తెలిపారు.

  • 10 Mar 2021 10:47 AM (IST)

    పోలుసులే ఆసరా అయ్యారు…

    ఓటేసేందుక వచ్చిన ఓ వృద్దుడికి పోలీసులే ఆసరా అయ్యారు. రెండు పోలీసులు తమ భుజాలపైన మోసుకుంటూ తీసుకెళ్లి వృద్ధుడితో ఓటు వేయించారు.

  • 10 Mar 2021 10:35 AM (IST)

    విశాఖలో ఓటేసిన మాజీ మంత్రి గంటా

    విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 10 Mar 2021 10:26 AM (IST)

    ప్రొద్దటూరులో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య వాగ్వాదం

    కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 5వ వార్డు వైసీపీ అభ్యర్థి మురళీధర్ రెడ్డి అనుచరులపై టీడీపీ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలింగ్ కేంద్రం వద్ద వాగ్వాదం జరిగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.

     

  • 10 Mar 2021 10:22 AM (IST)

    ఉదయం 9 గంటల వరకు జిల్లాల వారీగా పోలింగ్

    ఉదయం 9 గంటల వరకు జిల్లాల వారీగా పోలింగ్ పర్సంటేజ్ చూస్తే… ఉభయగోదావరి, గంటూరు జిల్లాల్లో ఎక్కువ పోలింగ్ శాతం నమోదైంది. 16శాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత ప్రకాశం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో పోలింగ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ మూడు జిల్లాల్లో 14శాతం పోలింగ్ రికార్డైంది. కృష్ణాజిల్లాలో 13 శాతం… నెల్లూరు అనంతపురం జిల్లాల్లో 12 శాతం, కర్నూలు జిల్లాలో 11 శాతం శ్రీకాకుళం జిల్లాలో 10శాతం.. చిత్తూరు జిల్లాలో 9శాతం… కడప జిల్లాల8శాతం పోలింగ్ పర్సంటేజ్‌ నమోదైంది.

  • 10 Mar 2021 10:20 AM (IST)

    స్వతంత్ర అభ్యర్థి భర్తపై జనసేన కార్యకర్తల దాడి

    గుంటూరు జిల్లా సత్తెనపల్లి 7వార్డులో పోలింగ్ బూత్ దగ్గర రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలు ఘర్షణకు దిగారు. స్వతంత్ర అభ్యర్థి ఉషారాణి భర్త ఆతుకూరి నాగేశ్వరరావుపై జనసేన కార్యకర్తలు దాడికి దిగగా.. పోలీసులు చెదరగొట్టారు.

  • 10 Mar 2021 10:18 AM (IST)

    టీడీపీ, వైసీపీ కార్యకర్త మధ్య స్వల్ప ఘర్షణ

    చిత్తూరు జిల్లా తిరుపతిలో 15వ డివిజన్‌ పోలింగ్‌ కేంద్రం దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్త మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రంలోకి వెళ్తుండగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించాలని టీడీపీ నేతలు ఆందోళన చేపట్టడంతో.. వైసీపీ అడ్డుకుంది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

  • 10 Mar 2021 09:31 AM (IST)

    పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

    రాష్ట్రంలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్‌తో కలిసి విజయవాడలోని బిషప్ గ్రేసి హైస్కూల్, సీవీఆర్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను ఎస్ఈసీ తనిఖీ చేశారు. వృద్ధులు, యువకులు, మహిళా ఓటర్లతో ఆయన మాట్లాడారు. పోలింగ్, క్యూ లైన్లపై ఓటర్ల స్పందన అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఏర్పాట్లపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్‌ఈసీ విజ్ణప్తి చేశారు.

  • 10 Mar 2021 09:17 AM (IST)

    పటమట లంకలో ఓటేసిన పవన్ కళ్యాణ్

    కృష్ణా జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉదయమే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పటమట లంక జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ పోలింగ్ బూత్ నెంబర్ 4లో పవన్ ఓటు వేశారు. పవన్‌తో పాటు ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 10 Mar 2021 09:12 AM (IST)

    వృద్దురాలికి సహాయం చేసిన పోలీసు

    గుంటూరు జిల్లా రేపల్లె 5 వార్డులో ఓ వృద్ధురాలు ఓటు వేసేందుకు విధుల్లో ఉన్న పోలీసు సహాయం అందించాడు. ఆ పెద్దావిడను చేతులతో పోలింగ్ కేంద్రానికి మోసుకెళ్లి ఓటు వేయించారు.

  • 10 Mar 2021 09:05 AM (IST)

    గుంటూరులో ఓటేసిన నక్కా ఆనంద్ బాబు

    గుంటూరు మున్పిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రంలో టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు కుటుంబసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 10 Mar 2021 09:01 AM (IST)

    పటమట లంకలో ఓటేసిన పవన్ కళ్యాణ్

    కృష్ణా జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉదయమే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పటమట లంక జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ పోలింగ్ బూత్ నెంబర్ 4లో పవన్ ఓటు వేశారు. పవన్‌తో పాటు ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 10 Mar 2021 09:00 AM (IST)

    విజయనగరం జిల్లాలో 8గంటల వరకు 5.02 శాతం పోలింగ్

    ఉదయం 8 గంటల వరకు విజయనగరంలోని వివిధ మున్నిపాలిటీల్లో నమోదైన పోలింగ్ శాతం

  • 10 Mar 2021 08:56 AM (IST)

    విశాఖలో పోలింగ్ ప్రశాంతం

    విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అప్పుఘర్ పోలింగ్ కేంద్రంలో ఓటేందుకు ఓటర్లు బారులు తీరారు.

  • 10 Mar 2021 08:51 AM (IST)

    పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన ఎస్పీ రాజా కుమారి

    విజయనగరం జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. వివిధ మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న పోలింగ్ సరళిని జిల్లా పోలీసు సూపరిండెంట్ బి రాజా కుమారి పరిశీలించారు.

  • 10 Mar 2021 08:42 AM (IST)

    తిరుపతిలో ఓటు వేసిన ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి

    తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి 50వ నంబర్‌ పోలింగ్ బూత్‌కి వచ్చిన ఎమ్మెల్యే.. గంటసేపు క్యూలో నిల్చుని ఓటు వేశారు..

  • 10 Mar 2021 08:38 AM (IST)

    ఓటు వేసిన విజయసాయిరెడ్డి

    విశాఖపట్నం కార్పొరేషన్ పరిధిలోని మారుతీనగర్ పోలింగ్ బూత్‌లో పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి సతీసమేతంగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 10 Mar 2021 08:37 AM (IST)

    పటమటలంక‌లో ఓటర్ల గందరగోళం

    విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పటమటలంక 9వ డివిజన్‌లో ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు. ఓటర్‌ స్లిప్పు, ఐడీ కార్డు ఉన్నప్పటికీ లిస్ట్‌లో పేరు కనిపించలేదు. దీంతో వారిని అధికారులు వెనక్కి పంపుతున్నారు. ఓటు లేదని చెప్పటంతో ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • 10 Mar 2021 08:30 AM (IST)

    జిల్లాకు ఓ నోడల్ అధికారి

    ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పోలింగ్‌ ప్రక్రియను సక్రమంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపట్టింది. ఎన్నికలను పర్యవేక్షించేందుకు జిల్లాకు ఓ నోడల్‌ అధికారి చొప్పున ప్రత్యేకంగా నియమించింది.

  • 10 Mar 2021 08:21 AM (IST)

    జమ్మలమడుగులో ఉత్సాహంగా పోలింగ్

    కడప జిల్లా జమ్మలమడుగు మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ 7గంటల నుండే మొదలైంది. జమ్మలమడుగు మున్సిపాలిటీ కి సంబంధించిన 20 వార్డుల్లో రెండు వార్డులు వైఎస్ఆర్‌సీపీ ఏకగ్రీవం చేసుకోగా, మిగతా 18 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. పోలీసులు అత్యంత సమస్యాత్మక వార్డులలో బారీ ఎత్తున పోలీసు బలగాలు మొహరించి బందోబస్తు నిర్వహిస్తున్నారు.

  • 10 Mar 2021 08:09 AM (IST)

    ఏలూరులో కొనసాగుతున్న పోలింగ్

    పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎన్నికల ఫలితాలు మాత్రం ప్రకటించొద్దని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది.

     

  • 10 Mar 2021 08:01 AM (IST)

    కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలింగ్

    నెల్లూరు జిల్లాలో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. అయితే, కరోనా నేపథ్యంలో ఓటర్లు భౌతిక దూరం పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

  • 10 Mar 2021 07:50 AM (IST)

    ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు

    ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలోని 12 కార్పొరేషన్, 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్‌ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.

  • 10 Mar 2021 07:46 AM (IST)

    ఓటు వేసిన ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

    అనంతపురం జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. నెహ్రూ మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కుటుంబసమేతంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 10 Mar 2021 07:21 AM (IST)

    అతి సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్

    శ్రీకాకుళం జిల్లాలో రెండు మున్సిపాలిటీలకు, ఒక నగరపంచాయితీకి ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఇచ్చాపురం 23 వార్డులు పలాస, కాశీబుగ్గ 29 వార్డులకు పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. నగరపంచాయితి పాలకొండలో 18 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 70 వార్డులకు పోలింగ్ జరుగుతుండగా, 170 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందుకు కోసం మొత్తం 106 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 96,567 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 1200 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 13 అతి సమస్యాత్మక వార్డులుగా, 24సమస్యాత్మక వార్డులుగా గుర్తించారు. అతి సమస్యాత్మక వార్డుల పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.

  • 10 Mar 2021 07:15 AM (IST)

    విజయనగరంలో మొదలైన పోలింగ్

    విజయనగరం జిల్లాలో ఒక మునిసిపల్ కార్పొరేషన్, నాలుగు మునిసిపాలిటీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 153 వార్డులలో ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయి.

Published on: Mar 10, 2021 08:46 PM