సర్పంచ్ కావాలంటే శివుని కటాక్షం ఉండాల్సిందే … ఆ గ్రామంలో శివాలయం నిర్మించిన వారికే సర్పంచ్ పదవి..

|

Feb 06, 2021 | 7:02 PM

గ్రామా సర్పంచ్ కావాలంటే చాలా చేయాలి.. ప్రజల మెప్పు పొందాలి.. గ్రామాన్ని అభివృద్ధి చేయాలి.. రోడ్లు , డ్రైనేజీలు, పాఠశాలలు, నీటిసంస్య పరిష్కారం..

సర్పంచ్ కావాలంటే శివుని కటాక్షం ఉండాల్సిందే ... ఆ గ్రామంలో శివాలయం నిర్మించిన వారికే సర్పంచ్ పదవి..
Follow us on

గ్రామా సర్పంచ్ కావాలంటే చాలా చేయాలి. ప్రజల మెప్పు పొందాలి.. గ్రామాన్ని అభివృద్ధి చేయాలి.. రోడ్లు , డ్రైనేజీలు, పాఠశాలలు, నీటిసంస్య పరిష్కారం ఇలా సవాలక్ష పనులుంటాయి..వాటన్నింటిని నెరవేరుస్తానంటూ.. హామీ ఇవ్వాలి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. లేదా మరో దారుంది.. అది మన రాజకీయ నాయకులకు బాగా తెలిసినదే… డబ్బు ఇచ్చి ఓట్లు కొనడం. అయితే ఆ ఊరిలో మాత్రం అలా కాదు. ఆ గ్రామంలో శివాలయం నిర్మించిన వారికి సర్పంచ్ పదవి. గ్రామ ప్రజలు అంతా కలసి శివాలయం నిర్మాణం చేస్తున్న ఆ కుటుంబానికి సర్పంచ్ పదవిని ఏకగ్రీవంగా ఇచ్చేసారు.

పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం చింతలకోటిగరువు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిని గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామంలో దాసరి మాణిక్యం కుటుంబీకులు శివాలయం నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చి ఆలయం నిర్మిస్తున్నారు.ప్రస్తుతం నిర్మాణ పనులు జరుతున్నాయి. అయితే ఆలయం పూర్తి కావాలంటే ఇంకా ఇరవై లక్షల వరుకూ ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. గ్రామ పెద్దలు అంతా కలిసి శివాలయంను పూర్తి చేసిన వారికి సర్పంచ్ పదవి ఏకగ్రీవం చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో దాసరి మాణిక్యం కుటుంబం ముందుకు రావడంతో దాసరి మహలక్ష్మి సర్పంచ్ గా ఏకగ్రీవం అయ్యారు. శివాలయం నిర్మాణం ఆ కుటుంబానికి సర్పంచ్ పదవిని ఏకగ్రీవంగా అందించింది. శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదంటారు… ఇప్పుడు ఆ శివుడి కటాక్షంతోనే ఇక్కడ సర్పంచ్ పదవి వరించింది..