AP Municipal Election Result: ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. కాసేపట్లో తేలనున్న ఫలితాలు

ఏపీ మున్సిపల్ ఎన్నికల కౌటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రీపోలింగ్‌ సెంటర్లతో పాటు.. పులివెందులలో కౌటింగ్‌పై కూడా క్లారిటీ రావడంతో పోలింగ్ ప్రక్రియను స్టార్ట్ చేశారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థల్లో కౌంటింగ్ ప్రిక్రయ కొనసాగుతోంది.13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

AP Municipal Election Result: ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. కాసేపట్లో తేలనున్న ఫలితాలు
Ap Local Body Elections Result (1)

Edited By:

Updated on: Nov 03, 2026 | 9:03 AM

ఏపీ మున్సిపల్ ఎన్నికల కౌటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రీపోలింగ్‌ సెంటర్లతో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పురపోరుకు సంబంధించిన ఫలితాలు మరికొన్ని నిమిషాల్లో విడుదల కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థల్లో కౌంటింగ్ ప్రిక్రయ కొనసాగుతోంది.13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం 3,186 వార్డుల్లో ఓట్లను లెక్కిస్తున్నారు.

కౌంటింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 138 కేంద్రాల ఏర్పాటు చేయగా.. మొత్తం 556 కౌంటింగ్ హాళ్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు కోసం 6,831 టేబుళ్ల ఏర్పాటు చేశారు. అలాగే కౌంటింగ్ విధుల్లో 47,817 మంది సిబ్బంది పాల్గొన్నారు. 1,372 సీసీ కెమెరాలతో కౌంటింగ్ కేంద్రాలపై నిఘా ఉంచారు.

ఇక మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 804 వార్డులకు కౌంటింగ్ జరుగుతుంది. 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో 2,382 వార్డులకు కౌంటింగ్ కొనసాగుతోంది. కార్పొరేషన్ల కౌంటింగ్ కోసం 4,026 టేబుళ్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల కౌంటింగ్ కోసం 2,805 టేబుళ్లు ఏర్పాటు చేశారు అధికారులు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవకతవకలు జరగకుండా పటిష్ట బందోభస్తు ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉండగా  పులివెందులలో కౌంటింగ్‌కు సైతం గ్రీన్‌ సిగ్నల్ వచ్చింది. పులివెందుల మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రీపోలింగ్‌పై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ ఓట్ల లెక్కింపు అనుమతించింది. పోలింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలపై ఎంపీ అవినాష్ రెడ్డి, చైర్మన్ అభ్యర్ధి వైఎస్ ప్రమీల కోర్టును ఆశ్రయించారు. దీంతో దీనిపై విచారణ జరిపిన న్యాయ స్థానం ఇరు వర్గాల వాదనల విన్న తర్వాత తీర్పును వెలువరింది.

లైవ్‌ అప్‌డైట్స్ ఇక్కడ చూడండి..

ఏపీ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us