
AP Guntur Corporation Election 2026: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జోరు ప్రదర్శిస్తోంది. మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ గెలుపు ఖాయమైపోయింది.
నగరంలోని మొత్తం 76 డివిజన్లకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో అత్యధిక స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తోంది. దీంతో గుంటూరు కార్పొరేషన్‌పై కూటమి పట్టు సాధించినట్లు కనిపిస్తోంది.
మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ విజయం ఖాయం కావడంతో టీడీపీ కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండటంతో తుది ఫలితాలపై ఆసక్తి నెలకొంది.
ఈ ఘన విజయం గుంటూరు ప్రజలదని, ఈ గెలుపు నాలో బాధ్యత మరింతగా పెంచిందని కోవెలమూడి లక్ష్మి అపర్ణ అన్నారు. స్వచ్ఛ గుంటూరు, హరిత గుంటూరు సాధనే నా లక్ష్యమని, ప్రజలు నాపై పెట్టుకున్న వారి నమ్మకం వమ్ము చేయనని పేర్కొన్నారు. గెలువు కోసం కృషి చేసిన కూటమి పార్టీల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. నాకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడు కు కృతజ్ఞతలు అని తెలిపారు. సహకరించిన డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్ మాధవ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
మచిలీపట్నం మేయర్‌గా తెలుగుదేశం పార్టీ (TDP) అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా విజయం సాధించారు. సమీప వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై భారీ మెజారిటీతో (32,657 ఓట్ల మెజారిటీతో) ఘనవిజయం సాధించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి