Andhra Pradesh: దివ్యాంగురాలి పింఛన్‌ను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందా..? అసలు ఈ అమ్మాయి ఎవరు.. పూర్తి వివరాలు..

AP Fact Check: ప్రస్తుత కాలంలో ఎక్కడైనా నకిలీ ప్రచారాలకు అడ్డు అదుపులేకుండా పోతోంది. ఇంకా గిట్టని వారైతే మరింత నకిలీ ప్రచారం, అవాస్తవ సమాచారాన్ని నెట్టింట పోస్ట్ చేసి.. జనంలో వేరేలా ప్రచారం చేస్తున్నారు.

Andhra Pradesh: దివ్యాంగురాలి పింఛన్‌ను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందా..? అసలు ఈ అమ్మాయి ఎవరు.. పూర్తి వివరాలు..
Ap Fact Check
Follow us

|

Updated on: Jul 04, 2023 | 5:18 PM

AP Fact Check: ప్రస్తుత కాలంలో ఎక్కడైనా నకిలీ ప్రచారాలకు అడ్డు అదుపులేకుండా పోతోంది. ఇంకా గిట్టని వారైతే మరింత నకిలీ ప్రచారం, అవాస్తవ సమాచారాన్ని నెట్టింట పోస్ట్ చేసి.. జనంలో వేరేలా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలోని కొందరు సోషల్ మీడియాలో ఓ దివ్యాంగురాలు ఓ పార్టీ పాటకు డాన్స్ చేస్తోందని కొందరు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ప్రచారం చేశారు. ఆమె పేరు అరుంధతి.. అని ఆమె ఓ పార్టీ పాటకు డాన్స్ చేస్తున్నట్లు అవాస్తవ ప్రచారం చేశారు. ఇది కొన్ని ఛానెళ్లలో కూడా ప్రసారం అయింది. అరుంధతికి టీడీపీ హయాంలో ఫింఛన్ మంజూరు అయిందని.. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని, దీంతో జగన్ ప్రభుత్వం పింఛన్ ను రద్దు చేసిందని ప్రచారం చేశారు. అయితే, ఈ వీడియోపై ఏపీ ప్రభుత్వానికి చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. మార్ఫింగ్ చేసిన వీడియో ప్రచురించడం, వైరల్ చేయడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తంచేంది. ఒడిశాలో పూరి రథయాత్ర ఉత్సవాల సందర్భంగా దివ్యాంగురాలు కృష్ణ భజన పాటలకు డ్యాన్స్ చేస్తోంది. వీడియో మార్ఫింగ్ చేసి అవాస్తవ ప్రచారం చేశారని పేర్కొంది. ఈ సందర్భంగా వీడియో అసలు లింక్ (https:// youtu.be/cE2wgdN1UnY) ను కూడా ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం పంచుకుంది.

‘‘కొందరు నెట్టింట నకిలీ ప్రచారం చేసినట్లు అమ్మాయి పేరు అరుంధతి కాదు.. వారు చెప్పినట్లు ఆమె రాజకీయ పాటకు డ్యాన్స్ చేయడం లేదు. వీడియో కొన్ని హ్యాండిల్స్ ద్వారా మార్ఫింగ్ చేసి.. పోస్ట్ చేశారు. దీన్ని కొందరు ఫ్యాక్ట్ చెక్ చేయకుండా వీడియోలను ప్రచురిస్తున్నాయి’’. అంటూ ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం పేర్కొంది. అవాస్తవ ఈ నకిలీ వార్తల ప్రచారం పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కొరింది.

ఇవి కూడా చదవండి

కొందరు వీటిని వైరల్ చేస్తున్నారని.. ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందనతో డిలీట్ చేశారని.. అవాస్తవ ప్రచారం చేస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..