AP EAPCET 2023 Counselling Schedule: ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్-2023 ఫలితాలు బుధవారం (జూన్ 14) విడుదలయ్యాయి. దాదాపు 3,15,297 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,52,717 మంది అర్హత పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా 2023-24 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్-2023లో వచ్చిన ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. రేపట్నుంచి (జులై 15) నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. పొరుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ చేస్తున్నప్పుడే మనమూ కౌన్సెలింగ్ నిర్వహించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఏడాది ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చిన సంగతి విధితమే. ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కులకు ఇంటర్ వెయిటేజీని కలిపి ర్యాంకులు కేటాయిస్తారు. ఐతే కొన్ని బోర్డుల నుంచి ఇంటర్ మార్కులు ఇంకా రానందున మొదటి విడతగా ఎంపీసీ స్ట్రీమ్ 1,40,361, బైపీసీ స్ట్రీమ్ 64,260 మందికే ర్యాంకులు కేటాయించారు. అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు కూడా వచ్చాక మరికొన్ని ర్యాంకులు విడుదల చేస్తామని ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.