సీఎం పదవి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విడిగా వస్తానో.. ఉమ్మడిగా వస్తానో నిర్ణయించుకోలేదని ఈసారి మాత్రం కచ్చితంగా అసెంబ్లీలోకి అడుగుపెడతానని విశ్వాసం వ్యక్తం చేశారు. జనసేనను ఎవరు ఆపుతారో చూస్తానంటూ వైసీపీకి సవాల్ విసిరారు. వారాహి విజయ యాత్రలో భాగంగా కాకినాడ జిల్లా కత్తిపూడిలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. పార్టీని పదేళ్ల పాటు నడపడం సాధారణ విషయం కాదన్నారు. పదివేల కోట్లు ఉన్నా పార్టీని నడపడం సాధ్యం కాదన్నారు. ప్రజలు గుండెల్లో పెట్టుకుంటేనే.. భావాజాలాన్ని అర్థం చేసుకునే వ్యక్తులుంటేనే పార్టీని నడపగలమని తెలిపారు.
జనసేన పార్టీ నడిపేందుకే సినిమాలు చేస్తున్నాని చెప్పారు. నాపై కక్షతోనే నా సినిమాలు అడ్డుకున్నారని మండిపడ్డారు. సినిమా టికెట్ల మీద కూడా ముఖ్యమంత్రి దిగజారిపోయే వ్యక్తని విమర్శించారు. నా బిడ్డల కోసం దాచి పెట్టిన నిధితో పార్టీ ఆఫీసు కట్టానని పేర్కొన్నారు. నా బిడ్డల బదులు మీరందూ నా బిడ్డలనుకున్నానని.. ఒక వ్యక్తి బలిదానం ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. నేతలు పొట్టి శ్రీరాములు పేరుతో సభ పెట్టి వదిలేస్తున్నారని. పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని జనసేన గుండెల్లో పెట్టుకుంటుందని వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..