
‘స్వర్ణాంధ్ర-2047’కి పది సూత్రాలు. ఇదే అంశంపై మంత్రులు, అధికారులతో పెద్ద డిస్కషనే జరిగింది. ఆ సుదీర్ఘ సమావేశంలో ఎన్నో అంశాలు వచ్చినా.. కొన్ని టాపిక్స్ ఇంట్రస్టింగ్‌గా అనిపించాయి. అందులో ఒకటి పాప్యులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ. మొన్నామధ్య ఆర్‌బీఐ ఓ రిపోర్ట్ ఇచ్చింది. అందులో అత్యంత చర్చనీయాంశమైన విషయం.. జనాభా సంక్షోభం. భారత ఆర్థిక వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను పూర్తిగా మార్చేయబోతున్న అంశం కూడా. 2036 నాటికి తెలంగాణలో వృద్ధుల సంఖ్య 17.1 శాతానికి పెరుగుతుందని చేరుతుందని అంచనా. ఏపీ ఇంకా దారుణం. అదే 2036కి వృద్ధుల సంఖ్య 19 శాతం వరకు ఉంటుందని అంచనా. దేశంలో అత్యధిక వయోధికులు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ 4వ స్థానానికి చేరుకుంటుంది. రీసెంట్ మీటింగ్‌లో యూరప్‌లోని 20 దేశాల సిచ్యుయేషన్‌పై సీఎం చంద్రబాబు ఓ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. కనీసం సెలబ్రేషన్స్ కూడా చేసుకోలేనంత వృద్ధ జనాభా పెరిగిందక్కడ. అందుకే, ఏపీలో పాప్యులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ తెచ్చారు ఓ ఆరేడు నెలల క్రితం. ఇంతకీ దాని సంగతి ఏమైంది? ఏపీలో జనాభా మార్పులు వేగంగా జరుగుతున్నాయ్. మరో మాటలో చెప్పాలంటే ఊహించని విధంగా మారుతున్నాయ్. సో, ఈ మార్పుల ఆధారంగా పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీని ప్రత్యేకంగా రెడీ చేయాల్సి ఉంటుంది....