AP Inter Board: ప్రైవేటు కాలేజీలకు ఇంటర్‌ బోర్డు వార్నింగ్‌.. గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరిక..!

AP Inter Board: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి అనధికారికంగా అడ్మిషన్లు..

AP Inter Board: ప్రైవేటు కాలేజీలకు ఇంటర్‌ బోర్డు వార్నింగ్‌.. గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరిక..!

Updated on: Aug 09, 2021 | 9:01 PM

AP Inter Board: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి అనధికారికంగా అడ్మిషన్లు చేసినట్టు తమ దృష్టికొచ్చిందని, అలాంటి చేరికలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్‌ బోర్డు ఈ విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

అయితే అడ్మిషన్ల నోటిఫికేషన్‌ విడుదల కాకుండానే, ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియ మొదలు కాకుండానే కొంతమంది విద్యార్థులు కొన్ని కాలేజీల్లో అడ్మిషన్లు పొంది.. ఫీజులు కూడా చెల్లించినట్టు తమకు సమాచారం అందిందని తెలిపారు. అలాంటి అడ్మిషన్లు చెల్లుబాటు కావని, విద్యార్థులు చెల్లించిన ఫీజులను ఆయా కాలేజీలు వెంటనే వాపసు ఇచ్చేయాలని ఆయన ఆదేశించారు. ఇలాంటి కాలేజీలను ఆర్‌ఐవో(రీజనల్‌ ఇన్‌స్పెక్షన్‌ ఆఫీసర్‌)లు గుర్తించి, గుర్తింపు రద్దుతో సహా, నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని రామకృష్ణ ఆదేశించారు.

ఇవీ కూడా చదవండి

Covid-19 Mask: ఏపీలోని ఈ నగరంలో మాస్క్ లేకుండా బయటకొస్తే వంద రూపాయల ఫైన్ కట్టాల్సిందే..!

Plastic Rice: అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్లాస్టిక్ రైస్ సప్లై అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన ఏపీ సర్కార్

Loading...
Unable to load recommendations.
Follow Us