
Mudragada Padmanabham: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) కన్ను మూశారు. గత నెల రోజులుగా ఆయన అనారోగ్యంతో హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం కన్నుమూశారు. 1953లో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ.. గత కొంత కాలంగా శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. ముద్రగడ పద్మనాభం ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందారు.
1978లో తొలిసారి జనతా పార్టీ నుంచి MLAగా గెలిచారు. 1989 వరకు వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దివంగత నేతలు ఎన్టీఆర్, చెన్నారెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పని చేశారు. 2024 ఎన్నికల ముందు వైఎస్సార్‌సీపీలో చేరారు. కాపు ఉద్యమ నేతగా ముద్రగడకు గుర్తింపు లభించింది. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.