Minister Narayana: నేను 10th ఫెయిల్‌.. తర్వాత నా సక్సెస్‌కు కారణం ఏంటంటే.. మంత్రి నారాయణ సక్సెస్‌ ఫార్ములా!

Minister Narayana: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కార్పొరేట్ విద్య సంస్థల తరహాలో పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు నిర్వహించాలని

Minister Narayana: నేను 10th ఫెయిల్‌.. తర్వాత నా సక్సెస్‌కు కారణం ఏంటంటే.. మంత్రి నారాయణ సక్సెస్‌ ఫార్ములా!

Edited By:

Updated on: Dec 07, 2024 | 8:49 PM

కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి అలాగే రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకంగా వ్యవహరిస్తున్న పొంగూరు నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకులుగా సక్సెస్ అయిన వ్యక్తిగా మాత్రమే చాలామందికి తెలుసు. అయితే తన సక్సెస్ కంటే ముందే తానొక ఫెయిల్యూర్ వ్యక్తినని ఆయనే చెప్పడం చాలామందికి ఆశ్చర్యాన్ని గురి చేసింది.

వృత్తి వ్యాపార పరంగా ఎంచుకున్న రంగంలో సక్సెస్ అవ్వాలంటే పట్టుదల అనేది చాలా ముఖ్యం. ఆ పట్టుదల అనేది మనలో కసి పెరిగినప్పుడే అవి సాధ్యపడుతుందని ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఏ మాట చాలామంది చెప్పి ఉంటారు.. కానీ నారాయణ చెప్పడం వెనుక మాత్రం ప్రత్యేకమనే చెప్పాలి. టెన్త్ క్లాస్ లో ఫెయిల్ అయిన విద్యార్థి గా నేను ఫెయిల్యూర్ స్టూడెంట్‌ని కానీ ఆ తర్వాత ఈ స్థాయికి రావడం వెనక కారణం ఒకటే అన్నారు నారాయణ. అదేంటో ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కార్పొరేట్ విద్య సంస్థల తరహాలో పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు నిర్వహించాలని తలపెట్టింది. ఇవాల్టి నుంచి మొదలైన కార్యక్రమంలో నెల్లూరులో ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులను ఉద్దేశించి నారాయణ మాట్లాడుతూ.. నేను ఒక ఫెయిల్యూర్ స్టూడెంట్ ని.. టెన్త్ క్లాసులో నేను ఫెయిల్ అయ్యాను.. నాతోపాటు పరీక్ష రాసిన వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతే నేను మాత్రం వెనక పడ్డానని బాధపడ్డా.. 1972 లో అప్పటి సీఎం భవనం వెంకట్రామిరెడ్డి ఫలితాలు వచ్చిన మూడు నెలల తర్వాత రెండు మార్కులు గ్రేస్ మార్కులుగా కలపాలని నిర్ణయం తీసుకోవడంతో పాసయ్యానని నారాయణ చెప్పారు.

అయితే అప్పుడే నాలో కసి పెరిగిందని, అప్పటినుంచి పట్టుదలగా చదివి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌గా నిలబడగలిగానని అన్నారు. మనలో కసి ఉన్నప్పుడే పట్టుదలతో అనుకున్న రంగంలో రాణించగలమని అన్నారు. ఆ తర్వాత విద్యాసంస్థలకు ఫౌండర్‌గా ఉన్న సమయంలో విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకువచ్చి వాటి ద్వారా ఎంతో మంది విద్యార్థుల్లో నైపుణ్యం పెంచగలిగానని అన్నారు.

ప్రస్తుతం నేను విద్యాసంస్థల నుంచి బయటకు వచ్చినా.. నా అనుభవంతో చెబుతున్న విద్యార్థులకు సబ్జెక్టులో మార్కులు తక్కువ వస్తే తల్లిదండ్రులు వారిని తిట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నా.. కార్పొరేట్ విద్యాసంస్థల సలహాలు ప్రభుత్వం తీసుకొచ్చిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ కు హాజరై మీ పిల్లలకు ఏ సబ్జెక్టులో మార్పులు తగ్గాయో ఆ టీచర్ తో మాట్లాడి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే ఆ విద్యార్థి సబ్జెక్టు పరంగా రాణించడానికి దోహదపదులు పడుతుందని అన్నారు. ఒకసారి వెనక బండి అంత మాత్రాన సక్సెస్ అవలేమన్న అప నమ్మకం ఉండకూడదు. మనలో కసి పట్టుదల ఉంటే ఉన్నత స్థానానికి వెళ్ళగలమానడానికి నేనే ఒక ఉదాహరణ. అందరూ దీన్ని ముందుకు వెళితే సక్సెస్ అవడం ఖాయం అని అన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us