ఏపీలో మరో కొత్త పథకం.. వారి అకౌంట్లోకి రూ.20 వేలు.. ప్రభుత్వం నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్..

ఏపీ ప్రభుత్వం కొత్త పథకం అమల్లోకి తెచ్చింది. జాతీయ కుటుంబ లబ్ధి పథకం (NFBS) ఏపీలో అమలుకు సిద్దమైంది. ఈ స్కీమ్ ద్వారా కుటుంబ పెద్ద మరణించినప్పుడు కుటుంబసభ్యులకు రూ.20 వేల ఆర్థిక సహాయం లభిస్తుంది. డెత్ సర్టిఫికెట్, ఆధార్, రేషన్ కార్డు వంటి పత్రాలతో RDO కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీలో మరో కొత్త పథకం.. వారి అకౌంట్లోకి రూ.20 వేలు.. ప్రభుత్వం నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్..
Money

Updated on: Nov 11, 2026 | 9:36 PM

కుటుంబ పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో జాతీయ కుటుంబ లబ్ధి పథకం (NFBS) అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద కుటుంబ పెద్ద చనిపోతే కుటుంసభ్యులకు ఒకేసారి రూ.20 వేల ఆర్థిక సహాయం అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. దీంతో ఇందులో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిసి ఉంటాయి. కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు కుటుంబ ఆర్ధిక అవసరాలకు, క్లిష్ట పరిస్థితుల్లో వారికి చేయూతనివ్వడానికి ఈ నిధులు ఉపయోగపడతాయి. కుటుంబ పెద్ద మరణించినప్పుడు అతడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయంగా ఇది అందుతుంది. విడతల వారీగా కాకుండా ఒకేసారి రూ.20 వేలు జమ చేశారు. కుటుంబ పెద్ద మరణించిన ఆరు నెలల్లోపు కుటుంబసభ్యులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కాలపరిమితి దాటితే దరఖాస్తులు స్వీకరించరు. డీబీటీ  విధానం ద్వారా నేరుగా కుటుంసభ్యుల బ్యాంకు ఖాతాల్లో ఇది జమ అవుతుంది.

అర్హతలు ఇవే..

-మరణించిన కుటుంబ పెద్ద వయస్సు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి

-గ్రామీణ ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు నెలవారీ ఆదాయం రూ.10 వేల లోపు ఉండాలి

-పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి నెలవారీ ఆదాయం రూ.12 వేలలోపు ఉండాలి

-విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్లలోపు ఉండాలి

-దారిద్య్ర రేఖకు దిగువన (BPL) ఉన్న కుటుంబాలు అర్హులు

-కుటుంబంలో సంపాదించే ప్రధాన వ్యక్తి (కుటుంబ పెద్ద) మరణించి ఉండాలి

-ఒకవేళ వితంతువు (కుటుంబ పెద్ద) మరణిస్తే ఆమె పిల్లలకు సాయం అందుతుంది

ఏయే పత్రాలు అవసరం

మరణించిన వ్యక్తి డెత్ సర్టిఫికెట్, మరణించిన వ్యక్తి ఆధార్ కార్డు, దరఖాస్తు చేసుకుంటున్న వ్యక్తి  ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ (NPCI లింక్ చేయబడి ఉండాలి).

దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO) కార్యాలయాన్ని సంప్రదించాలి. మాన్యువల్‌గా దరఖాస్తు పత్రాన్ని నింపి అవసరమైన పత్రాai  సమర్పించాలి. RDO అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అర్హులైన దరఖాస్తుదారుల వివరాలను సోషల్ సెక్యూరిటీ పెన్షన్ పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఈకేవైసీ పూర్తి చేశారు. దరఖాస్తులు కలెక్టర్ ఆమోదం పొందిన తర్వాత రూ.20 వేల ఆర్థిక సహాయం నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తారు. ఈ పథకం కుటుంబ పెద్దను కోల్పోయిన వారికి ఆర్థికంగా తోడ్పాాటు అందిస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us