మహానంది ఆలయం వద్ద నాగుపాము హల్‌చల్.. పరమేశ్వరుడి మహిమ అంటూ భక్తుల మొక్కులు

Edited By: Balaraju Goud

Updated on: Sep 29, 2025 | 2:00 PM

శరన్నవరాత్రుల వేళ.. సుప్రసిద్ధ శివాలయంలోకి నాగుపాము హల్‌చల్ చేసింది. భక్తుల క్యూ లైన్‌లలో కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. మరికొందరు భక్తులు పండుగ వేళ ఆ పరమేశ్వరుడి మహిమ అంటూ మొక్కలు చెల్లించుకున్నారు. నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రం అయిన మహానందిలో నాగుపాము సంచార కలకలం రేపింది.

శరన్నవరాత్రుల వేళ.. సుప్రసిద్ధ శివాలయంలోకి నాగుపాము హల్‌చల్ చేసింది. భక్తుల క్యూ లైన్‌లలో కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. మరికొందరు భక్తులు పండుగ వేళ ఆ పరమేశ్వరుడి మహిమ అంటూ మొక్కలు చెల్లించుకున్నారు. నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రం అయిన మహానందిలో నాగుపాము సంచార కలకలం రేపింది. ఆలయం పరిసరాల్లోని క్యూలైన్ సమీపంలో నాగుపాము కనిపించింది. దసరా ఉత్సవాల నేపథ్యంలో క్యూలైన్లలో భక్తల రద్దీ అధికంగా ఉంది. ఇంతలో ఎక్కడి నుంచో వచ్చిన నాగుపాము క్యూ లైన్‌లో కనిపించింది. దాన్ని చూసిన భక్తులు భయాందోళనకు గురైయ్యారు. అప్రమత్తమైన ఆలయ సిబ్బంది స్నేక్ స్నాచర్ మోహన్ కు సమాచారం ఇచ్చారు. రంగంలోని దిగిన స్నేక్ స్నాచర్ మోహన్ నాగుపామును చాకచక్యంగా పట్టుకుని సమీపంలోని నల్లమల అడవిలో వదిలిన పెట్టాడు. నాగుపాము పట్టుబడడంతో భక్తులు, ఆలయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Published on: Sep 29, 2025 01:41 PM