Andhrapradesh: వరద ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన కేంద్ర బృందాల పర్యటన.. వారేమన్నారంటే..

రాష్ట్రంలో ఇటీవల సంబంవించిన వరదలకు లోతట్టు ప్రాంతాలు జలమయ్యమవ్వడంతో వ్వయసాయ పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. ఇళ్లు మునిగి సామాన్య ప్రజానీకం ఎన్నో ఇబ్బందులు పడింది. ఈక్రమంలో ఏపీలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు

Andhrapradesh: వరద ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన కేంద్ర బృందాల పర్యటన.. వారేమన్నారంటే..
Central Team Visit
Follow us

|

Updated on: Aug 12, 2022 | 9:31 AM

Andhrapradesh: రాష్ట్రంలో ఇటీవల సంబంవించిన వరదలకు లోతట్టు ప్రాంతాలు జలమయ్యమవ్వడంతో వ్వయసాయ పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. ఇళ్లు మునిగి సామాన్య ప్రజానీకం ఎన్నో ఇబ్బందులు పడింది. ఈక్రమంలో ఏపీలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు రెండు రోజుల పాటు కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించాయి. ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలతో పాటు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈకేంద్రబృందాలు పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేశారు. గురువారం అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలోని వరద నీటిలో మునిగిన ప్రాంతాల్లో పర్యటించి నష్టాలను పరిశీలించింది కేంద్ర బృందం.

వరద ట్రాక్టర్లపై వెళ్లి నీట మునిగిన పంట పొలాలు, ఇళ్లలను పరిశీలించారు. ఈసందర్భంగా పంటలు నష్టపోయిన రైతులతో మాట్లాడి కేంద్ర బృందాల సభ్యులు వివరాలు సేకరించారు. కేంద్ర విపత్తుల శాఖ ఆర్థిక సలహాదారు రవినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో కూడిన బృందం రెండు బృందాలుగా పర్యటించారు. మూడు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించామన్నారు రవినేష్ కుమార్. రాష్ట్రంలో జరిగిన నష్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి.. వీడియోలు ఆధారంగా కేంద్రానికి నివేదిక ఇస్తామన్నారు. జిల్లా అధికారుల ఇచ్చిన నివేదిక స్పష్టంగా ఉందని చెప్పారు. ఇవన్నీ కలిపి కేంద్రానికి అందజేస్తామన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..