Weather report : అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఆంధ్రప్రదేశ్, యానం ప్రాంతంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు తెలియజేశారు ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
ఉత్తర కోస్తాంధ్ర.. యానాం :
> ఈరోజు ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
> రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్ర :
> ఈరోజు దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
> రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది.
రాయలసీమ :
ఈరోజు, రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
> ఎల్లుండి రాయలసీమలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రము సంచాలకులు తెలియజేశారు.